బిజినెస్

రెండు సంస్థల విలీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 13: ఐడీఎఫ్‌సీ బ్యాంక్, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ క్యాపిటల్ ఫస్ట్ విలీనం కానున్నాయి. తమ విలీనానికి సంబంధించిన ప్రతిపాదనను తమ బోర్డులు ఆమోదించాయని ఈ రెండు సంస్థలు శనివారం వెల్లడించాయి. ఈ రెండు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం, క్యాపిటల్ ఫస్ట్‌కు చెందిన ప్రతి పది షేర్లకు ఐడీఎఫ్‌సీ బ్యాంక్ 139 షేర్లను జారీ చేస్తుంది. ‘ఈ ఒప్పందం ఐడీఎఫ్‌సీ బ్యాంక్ పరివర్తనకు దోహదపడుతుంది. ఈ రెండు సంస్థలు కలిసి విభిన్నమైన, వేగంగా వృద్ధి చెందగల యూనివర్సల్ బ్యాంక్‌ను సృష్టిస్తాయి.
ఈ విలీనం రెండు సంస్థల వాటాదారులందరికీ వాటాల విలువను పెంచుతుంది’ అని ఐడీఎఫ్‌సీ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ రాజీవ్ లాల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. క్యాపిటల్ ఫస్ట్ విలీనం వల్ల రూ. 22,974 కోట్ల (2017 సెప్టెంబర్ నాటికి) లోన్ బుక్ గల రిటెయిల్ లెండింగ్ ఫ్రాంచైజీ ఐడీఎఫ్‌సీ బ్యాంకుకు కలుస్తోందని ఆ ప్రకటన వివరించింది. దీనివల్ల ఆ సంస్థకున్న 30 లక్షల మంది వినియోగదారులు, 228 ప్రదేశాల్లోని పంపిణీ నెట్‌వర్క్ కూడా జత కలుస్తున్నాయని తెలిపింది. క్యాపిటల్ ఫస్ట్ అసెట్స్ అండర్ మేనేజ్‌మెంట్ (ఏయూఎం)లో 27 శాతం అయిదేళ్ల సీఏజీఆర్‌తో, లాభాలలో 40 శాతంతో, 1.63 శాతం స్థూల లాభంతో, ఒక శాతం నికర లాభంతో ఈ సంస్థ వృద్ధి చెందుతోందని ఆ ప్రకటన వివరించింది. రెండు సంస్థల విలీనానంతరం ఏర్పడే కొత్త సంయుక్త సంస్థ ఏయూఎం రూ. 88వేల కోట్లు ఉంటుంది. క్యాపిటల్ ఫస్ట్‌కు ప్రస్తుతం చైర్మన్, ఎండీగా ఉన్న వి.వైద్యనాథన్ విలీనానంతరం ఏర్పడే కొత్త సంస్థకు ఎండీ, సీఈఓగా వ్యవహరిస్తారు. విలీనానంతరం లాల్ ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌కు నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. అయితే, ఈ పదవులు చేపట్టడానికి నియంత్రణ సంస్థల నుంచి ఆమోదం పొందాల్సి ఉంటుంది.