బిజినెస్

శత వసంతాల ఒడిలో ‘ఆర్యాపురం బ్యాంకు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జనవరి 13: చారిత్రక రాజమహేంద్రవరంలోని ఆర్యాపురం కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు రూ.1000 కోట్ల టర్నోవర్‌కు చేరుకోవడం అర్బన్ బ్యాంకుల చరిత్రలోనే విశేషత సంతరించకుంది. 1918లో కేవలం రూ. 300 షేర్ క్యాపిటల్‌తో మొదలైన ఈ బ్యాంకు రాష్ట్రంలోనే ల్యాండ్ మార్కుగా ఎదిగింది. వంద సంవత్సరాల వడిలో రూ. వెయ్యి కోట్ల టోర్నవర్‌కు చేరుకోవడం అర్బన్ బ్యాంకు చరిత్రలో చారిత్రాత్మకంగా నిలిచింది. శత వసంతాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకునేందుకు పాలకవర్గం ఏర్పాట్లు చేస్తోంది. ఒక శాఖతో మొదలెట్టిన ఈ ప్రస్థానం రాష్ట్ర వ్యాప్తంగా 16 బ్యాంకు శాఖలుగా విస్తరించింది. 1918 డిసెంబర్ 30న రూ.300ల షేర్ కేపిటల్‌తో సరిపెల్ల విశే్వశ్వర ప్రసాదరావు ఈ అర్బన్ బ్యాంకును వ్యవస్థీకరించారు. లక్షలాది మంది ఖాతాదారుల సేవలతో ఈ అర్బన్ బ్యాంకు రాజమహేంద్రవరం సామాజిక అభివృద్ధిలో మమేకమైంది. ప్రస్తుత పాలక మండలి ఛైర్మన్ చల్లా శంకరరావు నేతృత్వంలో 2014 జనవరి 1 నుంచి అధికారంలోకి వచ్చింది. అప్పటికి రూ. 340 కోట్ల డిపాజిట్ల నుంచి ప్రస్తుతం రూ.590 కోట్ల డిపాజిట్లకు చేరుకుంది. ప్రస్తుతం రూ. 360 కోట్ల రుణాలు అందుకుంటున్నారు. ప్రస్తుత పాలకవర్గం రూ.595 కోట్ల టర్నోవర్‌లో బాధ్యత తీసుకోగా ప్రస్తుతం రూ.936 కోట్ల టర్నోవర్‌కు పెరిగింది. ఈ వందో సంవత్సరంలోకి అడుగు పెట్టిన సందర్భంగా ఈ నెలాఖరుకల్లా రూ. 1000 కోట్ల టర్నోవర్‌కు చేర్చే లక్ష్యంగా కృషి చేస్తున్నామని ఛైర్మన్ చల్లా శంకరరావు చెప్పారు. 99 సంవత్సరాల్లో 90 వేల షేర్ హోల్డర్స్ కలిగిన ఏకైక అర్బన్ బ్యాంకుగా నిలిచింది. 15 శాతం డివిడెండ్‌గా రూ. 2.25 కోట్లు ఇచ్చే లక్షన్నర ఖాతాదారులు కలిగిన అర్బన్ బ్యాంకుగా చరిత్ర సృష్టించింది. ఇప్పటికే 9 శాఖలు కలిగిన ఆర్యాపురం అర్బన్ బ్యాంకు మరో ఏడు శాఖలను విస్తరిస్తున్నారు. గత ఏడాదిన రూ.20 కోట్ల నికర లాభాన్ని అధిగమించిన ఈ బ్యాంకు కొత్త భవనంలోకి ముఖ్యమంత్రి చేతుల మీదుగా రానున్న మే నెలలో ప్రారంభోత్సవంతో అడుగు పెట్టనుంది. బ్యాంకింగ్ వ్యవస్థలో పెనుమార్పులను సవాళ్ళుగా స్వీకరించి ఈ బ్యాంకు గణనీయమైన అభివృద్ధి సాధించింది. రుణాలు తీసుకున్న ఖాతాదారులు బీమా వర్తింపజేసే పధకం ఈ బ్యాంకు ముందస్తులో ఉంది. శత వసంతాలను రానున్న ఆగస్టులో ఉత్సవాలను సిద్ధమైంది. గుంటూరు, విశాఖలలో కొత్త బ్రాంచిలను ఏర్పాటు చేస్తున్నారు. 90 శాతం డిపాజిటర్లకు పాన్‌కార్డు మంజూరు చేసిన బ్యాంకుగా కూడా విశేషత సంతరించుకుంది. రిజర్వు బ్యాంకు నుంచి ‘ఎ’ గ్రేడు బ్యాంకుగా గుర్తింపు పొందిన ఈ బ్యాంకు సామాజిక సేవలో కూడా ముందుంది.