బిజినెస్

పొగాకు పరిశ్రమలో విదేశీ పెట్టుబడులను పూర్తిగా నిషేధించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 9: పొగాకు రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ)పై సంపూర్ణ నిషేధం విధించాలని డిఐపిపి (పారిశ్రామిక విధాన, అభివృద్ధి విభాగం) చేసిన ప్రతిపాదన పట్ల నీతి ఆయోగ్ ఆందోళన వ్యక్తం చేసింది. అయితే ఈ ప్రతిపాదనకు కేంద్ర ఆర్థిక శాఖ మద్దతు తెలియజేయడంతో ఈ అంశంపై డిఐపిపి త్వరలో వాణిజ్య మంత్రిత్వ శాఖతో పాటు నీతి ఆయోగ్‌తో చర్చలు జరపాలని భావిస్తోందని కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. దేశంలో ప్రస్తుతం పొగాకు రంగంలో కొత్త సాంకేతిక సహాకారాన్ని అందిపుచ్చుకునేందుకు, అలాగే ఫ్రాంచైజ్‌ల లైసెన్సింగ్, ట్రేడ్ మార్కింగ్, బ్రాండ్ నేమింగ్, యాజమాన్య కాంట్రాక్టులకు సంబంధించిన వ్యవహారాల్లో మాత్రమే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతిస్తూ, సిగరెట్లు, సిగార్‌లు ఇతర పొగాకు ఉత్పత్తుల తయారీలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను నిషేధిస్తున్నారు. అయితే ఫ్రాంచైజ్‌ల లైసెన్సింగ్, ట్రేట్ మార్కింగ్, బ్రాండ్ నేమింగ్, యాజమాన్య కాంట్రాక్టు వ్యవహారాల్లో కూడా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై నిషేధం విధించడం ద్వారా పొగాకు రంగంలో ఎఫ్‌డిఐలను సంపూర్ణంగా నిషేధించాలని డిఐపిపి ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే దేశంలో పొగాకు రంగానికి విదేశాల నుంచి పరోక్ష పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఏమాత్రం ఉండవని ఒక అధికారి తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా పొగాకు వినియోగాన్ని నియంత్రించాలన్న అంతర్జాతీయ ఒడంబడికపై భారత్ సంతకం చేసిన విషయం విదితమే. దీంతో మన దేశంలో పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని తగ్గించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. అందుకే పొగాకు ఉత్పత్తుల ప్యాకెట్లపై తప్పనిసరిగా 85 శాతం కవర్ అయ్యే విధంగా హెచ్చరిక చిత్రాలు ముద్రించాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సదరు సంస్థలకు స్పష్టం చేసింది. అయితే ఈ నిర్ణయంపై గాడ్‌ఫ్రే ఫిలిప్స్ లాంటి ప్రముఖ సంస్థలు తీవ్ర ఆందోళనలను వ్యక్తం చేస్తున్న తరుణంలో పొగాకు రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను సంపూర్ణంగా నిషేధించాలని డిఐపిపి ప్రతిపాదించడం ప్రాధాన్యత సంతరించుకుంది.