బిజినెస్

కార్పొరేట్ల లాభాలే ప్రధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: మూడో త్రైమాసికంలో బ్లూచిప్‌లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐటీసీ, విప్రోలు సాధించే లాభాలతో పాటు టోకు ధరల సూచీ ద్రవ్యోల్బణం గణాంకాలు ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్ల తీరుతెన్నులను నిర్దేశించనున్నాయని నిపుణులు పేర్కొన్నారు. ‘స్టాక్ మార్కెట్లలోకి పెద్ద మొత్తంలో పెట్టుబడులు తరలి రావడం, ప్రపంచ స్టాక్ మార్కెట్లలో నెలకొన్న ఉత్సాహం కారణంగా ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రస్తుత సానుకూల ధోరణిలోనే కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే సమీప భవిష్యత్తులో మార్కెట్ దృష్టి ఈ ఆర్థిక సంవత్సర మూడో త్రైమాసిక ఫలితాలు, బడ్జెట్ సంబంధిత సానుకూల అంశాలపైనా కేంద్రీకృతమై ఉంటుంది’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధన విభాగం అధిపతి వినోద్ నాయర్ పేర్కొన్నారు. శుక్రవారం మార్కెట్ పని వేళలు ముగిసిన తరువాత విడుదలయిన ఐఐపీ, రిటెయిల్ ద్రవ్యోల్బణం గణాంకాల పట్ల కూడా మదుపరులు స్పందించే అవకాశం ఉంది. తయారీ రంగం (మానుఫాక్చరింగ్ సెక్టార్) మెరుగైన పనితీరు కారణంగా పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి నవంబర్ నెలలో 17 నెలల గరిష్ఠ స్థాయిలో 8.4 శాతం నమోదయింది. అయితే ఈ సానుకూలాంశం వల్ల నెలకొన్న ఉత్సాహంపై డిసెంబర్ నెలలో 17 నెలల గరిష్ఠం 5.2 శాతానికి పెరిగిన చిల్లర ద్రవ్యోల్బణం నీళ్లు చల్లింది. శుక్రవారంతో ముగిసిన వారంలో దేశీయ స్టాక్ మార్కెట్లు సానుకూలంగా ముగిశాయి. కీలక సూచీలు సరికొత్త జీవనకాల గరిష్ఠ స్థాయిలకు చేరుకున్నాయి. కార్పొరేట్ కంపెనీల మూడో త్రైమాసిక లాభాలు బాగుంటాయన్న మదుపరుల అంచనాలు మార్కెళ్లలో కొనుగోళ్లకు దారితీశాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) అంచనాలకు తగిన రీతిలో ఫలితాలు సాధించనప్పటికీ, మరో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మెరుగయిన ఫలితాలనే నమోదు చేసింది. ‘స్టాక్ మార్కెట్‌లో ఉత్సాహపూరిత వాతావరణం కొనసాగుతుంది. అయితే, పెరుగుతున్న ముడి చమురు ధరలు ఇప్పటి వరకు ఆందోళన కలిగించే అంశం’ అని అరిహంట్ క్యాపిటల్ మార్కెట్స్ హోల్‌టైమ్ డైరెక్టర్ అనితా గాంధీ పేర్కొన్నారు. గత వారం బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 438.54 పాయింట్లు (1.28 శాతం) పుంజుకోగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ 122.40 పాయింట్లు (1.15 శాతం) పెరిగింది. ‘సోమవారం వెలువడే ద్రవ్యోల్బణం గణాంకాలపై మార్కెట్ దృష్టి ఉంటుంది. మూడో త్రైమాసిక ఫలితాలు వెలువడే సీజన్ ఈ వారం కొనసాగుతుంది. హిందుస్తాన్ యూనిలీవర్, యెస్ బ్యాంక్, ఐటీసీ, కొటక్ మహింద్రా వంటి దిగ్గజాల త్రైమాసిక ఫలితాలు వెలువడనున్నాయి. అయితే మూడో త్రైమాసికంలో మెరుగయిన ఫలితాలను నమోదు చేసిన ఇన్ఫోసిస్ సానుకూల ప్రభావం ఈ వారం మార్కెట్‌పై కొంత వరకు ఉంటుంది’ అని ఎపిక్ రీసెర్చ్ కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) ముస్త్ఫా నదీమ్ విశే్లషించారు. దేశంలో రెండో అతిపెద్ద ఐటీ ఎక్స్‌పోర్టర్ అయిన ఇన్ఫోసిస్ ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో 38.3 శాతం వృద్ధితో రూ. 5,129 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు వెల్లడించింది. ‘ప్రస్తుతం వెలువడుతున్న కార్పొరేట్ కంపెనీల మూడో త్రైమాసిక ఫలితాలపైన, రానున్న బడ్జెట్ అంచనాలపైన మార్కెట్ ఆధారపడి ఉంటుంది’ అని కొటక్ సెక్యూరిటీస్‌లోని పీసీజీ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ సంజీవ్ జర్‌బాదే పేర్కొన్నారు. ‘ప్రభుత్వం ప్రకటించే విధాన నిర్ణయాలను మదుపరులు జాగ్రత్తగా పరిశీలిస్తారు. కేంద్ర బడ్జెట్‌లో ఈ విధాన నిర్ణయాలు వెలువడనున్నాయి. అందువల్ల విధాన నిర్ణయాలతో కూడిన బడ్జెట్ సమీప భవిష్యత్తులో మార్కెట్ దిశను నిర్దేశించనుంది’ అని సామ్‌కో సెక్యూరిటీస్ వ్యవస్థాపకుడు, సీఈఓ జమీత్ మోదీ విశే్లషించారు.