బిజినెస్

రివర్సబుల్ టర్బైన్స్‌తో విద్యుత్ ఉత్పత్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జనవరి 16: నాగార్జున సాగర్ ప్రాజెక్టు పవర్ హౌస్ ద్వారా కృష్ణా డెల్టాకు విడుదలైన నీటిని తిరిగి విద్యుత్ ఉత్పత్తికి వినియోగించుకునేలా తొలిసారిగా పవర్ హౌస్ రివర్సబుల్ టర్బైన్స్‌ను నడిపించే ప్రయత్నాన్ని జెనోకో ఆరంభించింది. సాగర్ ప్రాజెక్టు దిగువన సాగర్ టెయిల్ పాండ్ నిర్మాణంతో టెయిల్ పాండ్ రిజర్వాయర్ మాదిరిగా మారిపోయి నీటి నిల్వ పెరిగి బ్యాక్‌వాటర్ కాస్తా సాగర్ ప్రాజెక్టు పవర్ హౌస్‌ను తాకుతుంది.
ఈ నీటితో రివర్స్‌బుల్ టర్బైన్స్‌ను నడిపించి విద్యుత్ ఉత్పత్తి చేయాలని జెన్‌కో యంత్రాంగం ప్రయత్నిస్తు ట్రయల్ రన్ నిర్వహిస్తుంది. పవర్ హౌస్‌లో ఎనిమిది యూనిట్ల ద్వారా 815 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ఉంది. పవర్‌హౌస్ నిర్మాణ సమయంలో 1972లో ఒక యూనిట్ బీహెచ్‌ఈఎల్ సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటుచేయగా దీనికి రివర్స్‌బుల్ టర్బైన్స్‌ను పద్ధతి లేదు. అప్పట్లో జపాన్ నుండి తెప్పించి అమర్చిన మిగతా ఏడు యూనిట్లలో సైతం రివర్స్‌బుల్ టర్బైన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. వీటిని ఇప్పటిదాకా ఎప్పుడు వినియోగించనప్పటికి సాగర్ టెయిల్ పాండ్ ద్వారా పవర్‌హౌస్‌కు అందుబాటులోకి వచ్చిన బ్యాక్ వాటర్‌ను సద్వినియోగం చేసుకునేందుకు తొలిసారిగా రివర్స్‌బుల్ టర్బన్స్ నడిపించాలని జెన్‌కో తలపెట్టింది. రివర్స్‌బుల్ టర్బైన్స్ నిర్వహణ ప్రక్రియను పరిశీలించి ఈ పద్ధతిలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగించాలా? వద్దా? అన్న అంశం పరిశీలించేందుకు నేడు జెన్‌కో సీఎండి ప్రభాకర్‌రావు సాగర్ పవర్‌హౌస్‌ను సందర్శించనున్నట్లు జెన్‌కో అధికారులు తెలిపారు. సీఎండీ పరిశీలించాకే రివర్స్‌బుల్ టర్బైన్స్ నడిపించడంపై తదుపరి నిర్ణయం ఉంటుందని వారు తెలిపారు. సాధారణ జల విద్యుత్ ఉత్పత్తి వ్యయంతో పోల్చితే రివర్స్‌బుల్ టర్బైన్స్ జల విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియకు ఖర్చు అధికంగా ఉంటుందని జెన్‌కో అధికారులు చెబుతున్నారు. రివర్స్‌బుల్ టర్బైన్స్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయాలని జెన్‌కో తలపిస్తే.. పవర్ హౌస్ చరిత్రలో ఇదే తొలిసారి అవుతుంది.

చిత్రం..సాగర్ టెయిల్ పాండ్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ సాగర్ ప్రాజెక్టు పవర్‌హౌస్‌ను తాకిన దృశ్యం