బిజినెస్

నాణ్యమైన ఉక్కు తయారీకి పెద్ద పీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 16: నాణ్యమైన ఉక్కు ఉత్పత్తికి విశాఖ స్టీల్ ప్లాంట్ పెద్ద పీట వేస్తోందని, ఈ నేపథ్యంలో కార్మికులంతా ఉక్కు ఉత్పత్తి విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండీ మధుసూదన్ అన్నారు. స్టీల్ ప్లాంట్‌లో ప్రతి సంవత్సరం మాదిరి ఈ ఏడాది కూడా అత్యుత్తమ వ్యాపార పటిమను కనబరచిన శాఖలకు గుర్తింపుగా చైర్మన్స్ ట్రోఫీ ఫర్ ఎక్స్‌లెన్స్ అవార్డును ప్రకటించారు. ఈ సంవత్సరం ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన శాఖాధిపతులకు సీఎండీ మధుసూదన్, డైరక్టర్లు మంగళవారం సర్ట్ఫికెట్లను అందచేశారు. ఈ సందర్భంగా మధుసూదన్ మాట్లాడతూ స్టీల్ ప్లాంట్ కొత్త ఉత్పత్తులైన బొరోన్, సిహెచ్‌క్యూ స్టీల్‌కు మార్కెట్‌లో మంచి డిమాండ్ వచ్చిందని అన్నారు. అలాగే, విశాఖ స్టీల్ ప్లాంట్ కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో పునరుత్పత్తుల్లో విజయం సాధించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో డైరక్టర్లు పీసీ మహాపాత్ర, పీ రాయ్‌చతుర్థి, కేసీ దాస్, వీవీ వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..విజేతలకు సర్ట్ఫికెట్లు అందిస్తున్న స్టీల్ ప్లాంట్ సీఎండీ మధుసూదన్