బిజినెస్

ఐటీ సిరి.. మంగళగిరి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 16: గుంటూరు జిల్లాలోని మంగళగిరి ఇక ఐటీ సిరి కానుంది. ఇప్పటివరకూ రాజధాని నగరంలో సరైన ఐటీ కంపెనీలు లేవన్న నిరాశకు ఇక తెరపడనుంది. ప్రస్తుతం గొల్లపూడి, గన్నవరం, విజయవాడ పటమట ఆటోనగర్‌కు చిన్నచిన్న ఐటీ కంపెనీలే తరలివచ్చాయి. దానివల్ల భారీ సంఖ్యలో ఉద్యోగావకాశాలు రాకపోయినా వందల మందికయినా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కాయి. అయితే రాజధానిలో భారీ స్థాయిలో, ఒకేచోట ఐటీ కంపెనీలు లేవన్న బెంగ మాత్రం బుధవారంతో తీరనుంది. విజయవాడకు అనుసంధానంగా ఉన్న మంగళగిరి ఏపీ ఎన్‌ఆర్‌టీ టెక్ పార్కులో 13 కంపెనీలు, అక్కడే ఉన్న పైకేర్ ఐటీ పార్కులో మరో 3 కంపెనీలను ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బుధవారం ప్రారంభించనున్నారు. వీటిలో రెండు మినహా మిగిలినవన్నీ బ్రిటన్, అమెరికాకు చెందిన కంపెనీలే కావడం విశేషం. విమర్శల నడుమ రాష్ట్ర కేబినెట్‌లో చేరిన లోకేష్ ఐటీ శాఖ మంత్రిగా సక్సెస్ అయ్యారు. రాష్ట్రానికి కొత్త ఐటీ కంపెనీలను తీసుకొచ్చి తన పనితీరుతో విమర్శల నోళ్లు మూయించారు. వందరోజుల వరకూ తాను మీడియాతో మాట్లాడనని, రాష్ట్రానికి కొన్ని ఐటీ కంపెనీలను తీసుకొచ్చిన తర్వాతనే మీడియా ముందుకు వస్తానని పదవీ బాధ్యతలు స్వీకరించిన తొలిరోజు ఇచ్చిన మాటను లోకేష్ నెరవేర్చుకున్నారు. తన విదేశీ పర్యటనల్లో కుదుర్చుకున్న ఒప్పందాలను కార్యాచరణలోకి తీసుకొచ్చేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని సమకూర్చుకుని, దాన్ని ఏపీ ఎన్‌ఆర్‌టీ సంస్థతో సమన్వయపర్చినన ఫలితంగా సంక్రాంతి రోజు తిరుపతిలో, అంతకుముందు విశాఖ, అప్పుడే విజయవాడలో కొన్ని ఐటీ కంపెనీలను రప్పించిన లోకేష్.. ఇప్పుడు విజయవాడకు ఆనుకుని ఉన్న మంగళగిరిలో ఒకేరోజు 16 ఐటీ కంపెనీలను ప్రారంభించనున్నారు. బుధవారం లోకేష్ చేతులమీదుగా ప్రారంభం కానున్న 16 ఐటీ కంపెనీల వల్ల తక్షణం 600 మంది ఐటీ నిపుణులకు ఉద్యోగాలు లభించనున్నాయి. అవి పూర్తిస్థాయిలో పని మొదలుపెట్టిన తర్వాత ఆ సంఖ్య 1800లకు పెరగనుంది. కాగా మరికొద్ది రోజుల్లో ఇక్కడే మరో 20 కంపెనీలు రానున్నాయి. సిగ్నం డిజిటల్ నెట్‌వర్క్, స్క్రిప్ట్ బీస్, స్వరా సాఫ్ట్, సన్‌స్వెట్‌పిక్సీ, సువిజ్, డీఎఫ్‌ఐ స్విస్, ఎక్సెల్లార్, మెక్‌మైక్లినిక్, బీవీజీ ఇండియా కంపెనీలు ప్రారంభం కానుండగా, ఇందులో మూడు స్టార్టప్ కంపెనీలున్నాయి. వీటిలో మెక్‌మైక్లినిక్, ఎక్సెల్లార్, బీవీజీ కంపెనీలు పైకేర్ ఐటీ పార్కులో ఏర్పాటవుతున్నాయి.