బిజినెస్

రసాయనిక గుజ్జు దిగుమతులపై 10 శాతం కస్టమ్స్ సుంకం విధించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 16: విదేశాల నుంచి దిగుమతి చేసుకునే హార్డ్‌వుడ్ కెమికల్ పల్ప్ (రసాయనిక గుజ్జు)పై పదిశాతం కస్టమ్స్ సుంకం విధించాలని, దీని వల్ల దేశయ పరిశ్రమలు నిలదొక్కుకుంటాయని, వచ్చే బడ్జెట్‌లో తమ వినతిని పరిగణనలోకి తీసుకోవాలని అసోచామ్ అనే వాణిజ్య సంస్థ కేంద్రాన్ని కోరింది.కెమి థర్మో మెకానికల్ పల్ప్‌పై కూడా సుంకం విధించాలని అసోచామ్ సెక్రటరీ జనరల్ డిఎస్ రావత్ కోరారు. దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కలపను ఇచ్చే మొక్కలను పెంచాలని కోరారు. దీని వల్ల ఉద్యోగావకాశాలు పెరుగుతాయని, పైగా దేశీయంగా గుజ్జు తయారీకి మొక్కల పెంపకం ఉపకరిస్తుందన్నారు. దేశంలో పేపర్ పరిశ్రమ టెక్నాలజీ అప్‌గ్రేడ్ చేసేందుకు అవసరమైన క్యాపిటల్ గూడ్స్ దిగుమతి చేసుకోవాలన్నారు. దీని వల్ల పర్యావరణ పరిరక్షణ వీలవుతుందన్నారు. మన దేశంలోకి సాలీనా రూ.4600 కోట్ల విలువైన 1.25 మిలియన మెట్రిక్ టన్నుల కాగితం గుజ్జును దిగుమతి చేసుకుంటున్నామన్నారు. 2012 మే నెలలో ఈ గుజ్జు దిగుమతిపై కస్టమ్స్ సుంకాన్ని తొలగించిందన్నారు. దీని వల్ల కస్టమ్స్ శాఖకు రూ.245 కోట్ల ఆదాయం తగ్గిందన్నారు. కాగా రైతుల ద్వారా సాలీనా 31.8 మిలియన్ పనిదినాలు కల్పించి 157 మిలియన్ల కలప చెట్లను పెంచాలన్నారు. కాగితం పరిశ్రమకు అవసరమైన గుజ్జు దేశీయంగా తయారు చేసేందుకు వీలవుతుందన్నారు. సాఫ్ట్ వుడ్ గుజ్జుపై కూడా కస్టమ్స్ సుంకాన్ని మినిహాయించాలన్నారు.
ఐటి సాఫ్ట్‌వేర్ కనె్సల్టింగ్ సంస్థ బోద్ ట్రీ మగధ యూనివర్శిటీ నుంచి రూ.43 కోట్లు, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చి ఎడ్యుకేషన్ సంస్థ నుంచి రూ.8.39కోట్ల ఆర్డర్‌ను సాధించినట్లు బోద్ ట్రీ సంస్ధ ఎండి ఎల్‌ఎన్ రామకృష్ణ తెలిపారు. డిజిటల్ యూనివర్శిటీగా తీర్చిదిద్దేందుకు తాము అవసరమైనసేవలు అందిస్మాన్నారు. అడ్మిషన్లు, పరీక్షలు, ధృవపత్రాలు, ఇతర విభాగాలను డిజిటలైజేషన్ చేస్తతమన్నారు. అలాగే బెంగళూరుకు చెందిన శాప్ సొల్యూషన్స్ కంపెనీ గాప్ బ్రిడ్జితో కూడా ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయన చెప్పారు. గత 18 నెలల్లో రూ.200 కోట్ల విలువ చేసే కాంట్రాక్టును సాధించినట్లు ఆయన చెప్పారు.
సిగరెట్ల స్మగ్లింగ్ అరికట్టాలి: కేంద్రాన్ని కోరిన ఫైఫా
పొగాకుపంటపై ఆధారపడిన లక్షలాది మంది రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని విదేశీ సిగరెట్ల స్మగ్లింగ్‌ను అరికట్టాలని అఖిల భారత రైతు సంఘాల సమాఖ్య (ఫైఫా) కేంద్రాన్ని కోరింది. ఫైఫా సమాఖ్య ప్రధాన కార్యదర్శి మురళి బాబు మాట్లాడుతూ ఆంధ్రా, తెలంగాణ, కర్నాటక, గుజరాత్‌లో పొగాకు రైతులు ఉన్నారన్నారు. సిగరెట్ల పరిశ్రమలో స్మగ్లింగ్ సిగరెట్ల వాటా 25 శాతం ఉందన్నారు. దీని వల్ల కేంద్రానికి సాలీనా రూ.13వేల కోట్ల నష్టం వాటిల్లుతోందన్నారు.వ్యవస్థీకృత నేరగాళ్లు సిగరెట్ల స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారన్నారు. పొగాకు రైతులపై ఆంక్షలు విధించి వేధించడం మానుకోవాలన్నారు. దేశీయంగా వర్జీనియా పొగాకు రైతుల ఆదాయం రూ.3300 కోట్ల మేర తగ్గిందన్నారు. మనదేశంలోనే పొగాకుపై ఆధారపడి జీవించే రైతులు ఎక్కువన్నారు.