బిజినెస్

పరిశ్రమలవైపు సేద్యం పట్టభద్రులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 16: వ్యవసాయ పట్టభద్రులు వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటులో ఆకస్తి కలిగించేందుకు వీలుగా అగ్రి ఇంకుబేషన్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం కసరత్తు చేస్తోంది. విద్యార్థుల్లో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలపై ఆసక్తి కలిగించేందుకు హైదరాబాద్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆవరణలో మంగళవారం ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. న్యూఢిల్లీకి చెందిన ఇండిగ్రాం ల్యాబ్స్ ఫౌండేషన్, ఇండియన్ సొసైటీ ఆఫ్ అగ్రిబిజినెస్ ప్రొఫెషనల్స్ సంస్థ ప్రతినిధులతో విశ్వవిద్యాలయం వైస్-్ఛన్సలర్ డాక్టర్ ప్రవీణ్‌రావు తన కార్యాలయంలో మంగళవారం చర్చలు జరిపారు. వ్యవసాయ పట్ట్భద్రుల్లో పరిశ్రమల ఏర్పాటుకు ఆసక్తి రేకెత్తించేందుకు ప్రయత్నించాలని నిర్ణయించారు. ఇందుకోసం వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అగ్రి ఎంటర్‌ప్రూనర్‌షిప్ సెల్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ బాధ్యతను అంతర్జాతీయ వ్యవహారాల డైరెక్టర్ డాక్టర్ జీవన్‌రావుకు వైస్-్ఛన్సలర్ అప్పగించారు. ఈ చర్చల్లో యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్. సుధీర్‌కుమార్‌తో పాటు యూనివర్సిటీ ఉన్నతాధికారుల డాక్టర్ టి. ప్రదీప్, డాక్టర్ డి. రాజిరెడ్డి, డాక్టర్ కె.ఎస్. డాంగి, డాక్టర్ సదాశివరావు, డాక్టర్ కెవిఎస్ మీనాకుమారి, డాక్టర్ లక్ష్మణ్, డాక్టర్ కె. జీవన్‌రావు, గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.