బిజినెస్

కీలక సూచీల పతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 16: వరుసగా మూడు సెషన్లు గరిష్ఠ స్థాయి రికార్డులు సృష్టించిన దేశీయ స్టాక్ మార్కెట్ కీలక సూచీలు మంగళవారం మదుపరులు లాభాల స్వీకరణకు పూనుకోవడంతో పాటు స్థూలార్థిక గణాంకాలు బలహీనంగా ఉండటంతో పడిపోయాయి. సోమవారం మార్కెట్ పనివేళలు ముగిసిన తరువాత విడుదలయిన స్థూలార్థిక గణాంకాలు భారీగా పెరిగిన దేశ వాణిజ్య లోటును వెల్లడించాయి. దేశ దిగుమతులు, ఎగుమతుల మధ్య వ్యత్యాసం డిసెంబర్ నెలలో 14.88 బిలియన్ డాలర్లకు పెరిగింది. 2016 డిసెంబర్ నెలతో పోలిస్తే దేశ వాణిజ్య లోటు 41 శాతం పెరిగింది. ముడి చమురు, బంగారం దిగుమతుల వ్యయం పెరగడమే వాణిజ్య లోటు పెరగడానికి ప్రధాన కారణమయింది. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ మంగళవారం ఉదయం 34,877.71 పాయింట్ల అధిక స్థాయి వద్ద ప్రారంభమయింది. కార్పొరేట్ కంపెనీల మూడో త్రైమాసిక ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉండటంతో ఉదయం సెషన్‌లో మదుపరులు ఎడతెరిపి లేకుండా కొనుగోళ్లకు పూనుకోవడం వల్ల సెనె్సక్స్ పైకి ఎగబాకుతూ ఇంట్రా-డేలో 34,936.03 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. అయితే రికార్డు స్థాయిల వద్ద మదుపరులు లాభాల స్వీకరణకు పూనుకోవడం వల్ల ఇంట్రా-డేలో 34,735.55 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరలో కొంచెం పుంజుకొని క్రితం ముగింపుతో పోలిస్తే 72.46 పాయింట్లు (0.21 శాతం) నష్టపోయి, 34,771.05 పాయింట్ల వద్ద ముగిసింది. సెనె్సక్స్ క్రితం మూడు సెషన్లలో కలిపి 410.44 పాయింట్లు పెరిగి, సరికొత్త జీవనకాల గరిష్ఠ స్థాయి 34,843.51 పాయింట్ల వద్ద సోమవారం ముగిసింది.
వరుసగా మూడు సెషన్లు లాభాలు ఆర్జించిన నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ కూడా మంగళవారం పతనమయింది. అయితే ఈ సూచీ కీలకమయిన 10,700 మార్కుపైన ముగియగలిగింది. క్రితం ముగింపుతో పోలిస్తే 41 పాయింట్లు (0.38 శాతం) పడిపోయిన నిఫ్టీ 10,700.45 పాయింట్ల వద్ద స్థిరపడింది. రియల్టీ, మెటల్, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఇంధన, ఇన్‌ఫ్రా, ఎఫ్‌ఎంసీజీ, ఆటో రంగాల షేర్లలో మదుపరులు అమ్మకాలకు పూనుకోవడంతో ఈ సూచీ పడిపోయింది. అయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజి (ఐటీ) రంగ షేర్ల ధరలు పెరగడం మంగళవారం నిఫ్టీ పతనాన్ని కొంత వరకు అడ్డుకోగలిగింది.
నిఫ్టీ మంగళవారం 10,761.50 పాయింట్ల అధిక స్థాయి వద్ద ప్రారంభమయి, 10,762.35 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 10,687.85 పాయింట్ల కనిష్ట స్థాయి మధ్య కదలాడింది.
విదేశీ మార్కెట్ల విషయానికొస్తే, కార్పొరేట్ కంపెనీల ఫలితాల కోసం మదుపరులు వేచిచూస్తుండటం వల్ల అనేక యూరోపియన్ స్టాక్ మార్కెట్లలో కీలక సూచీలు గరిష్ఠ స్థాయిల వద్ద ముగిశాయి. ఆరంభంలో నష్టపోయిన ఆసియన్ స్టాక్ మార్కెట్ సూచీలు తరువాత పుంజుకున్నాయి. రంగాల వారీగా చూస్తే, ఐటీ మాత్రమే లాభపడింది. ఐటీ సూచీ 3.65 శాతం పెరిగింది. స్థిరాస్తి రంగం 3.38 శాతం పడిపోయింది. తరువాత స్థానాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు 2.81 శాతం, మెటల్ 2.84 శాతం, ఎనర్జీ 2.12 శాతం, ఆటో 1.25 శాతం, ఎఫ్‌ఎంసీజీ 1.09 శాతం, ఇన్‌ఫ్రా 1.06 శాతం, మీడియా 0.68 శాతం, ఫైనాన్స్ సర్వీస్ 0.45 శాతం చొప్పున నష్టపోయాయి. మంగళవారం సెషన్‌లో ప్రధానంగా లాభపడిన కంపెనీలలో విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజి, టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహింద్రా, జీ, డాక్టర్ రెడ్డీస్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌యూఎల్, అదాని పోర్ట్స్ ఉన్నాయి. నష్టపోయిన వాటిలో కోల్ ఇండియా, హెచ్‌పీసీఎల్, బజాజ్ ఫైనాన్స్, రిల్, వేదాంత, అరబిందో ఫార్మా, టాటా స్టీల్, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఉన్నాయి. ఎన్‌ఎస్‌ఈలో 340 కంపెనీల షేర్ల ధరలు పెరగగా, 1,491 కంపెనీల షేర్ల ధరలు పడిపోయాయి. 40 కంపెనీల షేర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు.