బిజినెస్

‘మేథోసంపత్తి’ మెరుగుపడొచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 16: భారత ప్రభుత్వం దేశ మేథోసంపత్తి సామర్థ్యాన్ని పెంచడానికి జాతీయ ఐపీఆర్ విధానాన్ని ప్రవేశపెట్టడంతో అంతర్జాతీయ మేధాసంపత్తి (ఇంటలెక్చువల్ ప్రాపర్టీ- ఐపీ) సూచీలో భారత్ ర్యాంక్ మెరుగుపడొచ్చని గ్లోబల్ ఇన్నొవేషన్ పాలసీ సెంటర్ (జీఐపీసీ)లోని ఒక ఉన్నతాధికారి పేర్కొన్నారు. మేథోసంపత్తి సూచీలో నిరుడు భారత్ చివరి స్థానానికి సమీపంలో నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా 45 దేశాలతో కూడిన ఈ సూచీలో భారత్ 43వ స్థానంలో నిలిచింది. అమెరికా చాంబర్ ఆఫ్ కామర్స్‌కు చెందిన గ్లోబల్ ఇన్నొవేషన్ పాలసీ సెంటర్ రూపొందించిన ఆరవ ఎడిషన్ నివేదిక ఈ సంవత్సరం ఫిబ్రవరి 8న విడుదల అవుతుంది. ఈ సంవత్సరం అంతర్జాతీయ మేథోసంపత్తి సూచీలో 40 అంశాల ఆధారంగా 50 దేశాల పనితీరును పరిశీలిస్తారు. ఇతర బ్రిక్స్ దేశాలు- బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా సహా ఇతర దేశాలతో పోలిస్తే భారత మేథోసంపత్తి వ్యవస్థ బలహీనంగా ఉందని జీఐపీసీ భావిస్తోంది. ఫార్మా వంటి హై-రిస్క్ కలిగిన రంగాలలో పరిశోధన, అభివృద్ధిలో పెట్టుబడులను ఆకర్షించడానికి న్యాయపరమైన నిశ్చయం అవసరమని అభిప్రాయపడుతోంది. ‘మా సూచీలో భారత్ పనితీరు.. గ్లోబల్ ఇన్నొవేషన్ ఇండెక్స్‌లో, ప్రపంచ బ్యాంకు డూయింగ్ బిజినెస్ నివేదికలో సరళిని పోలి ఉంది. ఈ రెండింటిలో భారత్ క్రమంగా పైకి ఎగబాకింది. అలాగే, మా సూచీలోనూ భారత్ తన ర్యాంకును మెరుగు పరచుకుంటుంది. కొత్త ఐపీఆర్ విధానంలో భాగంగా చర్యలు తీసుకున్న ఇక్కడి విధాన నిర్ణేతలకు ఇది శుభవార్త అవుతుందని నేను అనుకుంటున్నాను’ అని జీఐపీసీ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ పాట్రిక్ కిల్‌బ్రైడ్ ఒక వార్తాసంస్థ ప్రతినిధితో మాట్లాడుతూ అన్నారు. దేశీయ పారిశ్రామికవేత్తలు మేధాసంపత్తి హక్కులను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి వివిధ దేశాలు చేస్తున్న కృషిని పరిశీలించేందుకు వ్యవస్థీకృత సామర్థ్యంపై ఈ సంవత్సరం ఒక కొత్త కేటగిరి ప్రవేశపెట్టినట్టు ఆయన చెప్పారు. ఈ కొత్త అంశంలో భారత్ మెరుగైన పనితీరును కనబరుస్తుందనే అంచనాతో ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు.
భారత్ ఐపీఆర్ విధానం గురించి మాట్లాడుతూ, పేటెంట్ తారమారయ్యే లేదా పేటెంట్‌పై అనిశ్చితి నెలకొనేలా చట్టాలు లేదా వ్యవస్థ ఉంటే హైరిస్క్, అధిక వ్యయంతో కూడిన పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ)లోకి దీర్ఘకాలంలో పెట్టుబడులు పెట్టడం ఇండస్ట్రీకి కష్టమవుతుందని కిల్‌బ్రైడ్ అన్నారు. భారత్‌కు తన సాంకేతిక పరిజ్ఞాన రంగం, విజ్ఞానవంతమైన ఆర్థిక వ్యవస్థలో ఉన్న బలమైన అంశాలను సానుకూలంగా మలచుకునే సామర్థ్యం ఉందని ఆయన అన్నారు.