బిజినెస్

మద్యం ధరలకు రెక్కలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జనవరి 18: సంక్రాంతి పండుగ సీజన్ మద్యం వ్యాపారులకు కనకవర్షం కురిపిస్తోంది. పండుగ సీజన్ పేరుతో సిండికేట్లు మద్యం ధరలను ఎడాపెడా పెంచి విక్రయాలు సాగిస్తున్నారు. సంక్రాంతి హడావుడి తగ్గుముఖం పట్టినప్పటికీ పండుగ పేరు చెప్పి అనధికారికంగా పెంచిన ధరలను తూర్పు గోదావరి జిల్లాలో మద్యం వ్యాపారులు కొనసాగిస్తున్నారు. ఈ పండుగ సీజన్‌లో సందట్లో సడేమియాగా మద్యం సీసాపై ముద్రించిన ఎమ్మార్పీ కంటే అధిక ధర ముద్రించిన మరో స్టిక్కర్ అతికిస్తున్నారు. అక్కడితో ఆగకుండా అదనంగా హాఫ్ బాటిల్‌కు 20 రూపాయల వంతున (ఆయా బ్రాండ్లను) వసూలు చేస్తున్నారు. ఎమ్మార్పీకి అదనంగా వడ్డించిన ధర సంగతలా ఉంటే అనధికారికంగా జరుగుతున్న అక్రమ వసూళ్ళ పట్ల మద్యంప్రియులు తీవ్ర అవహనం వ్యక్తం చేస్తున్నారు. ఆయా బ్రాండ్ల మద్యానికున్న డిమాండ్‌ను పరిగణలోకి తీసుకుని ధర పెంచి విక్రయిస్తున్నట్టు మద్యంప్రియులు వాపోతున్నారు. మార్కెట్‌లో డిమాండ్ అధికంగా ఉన్న కొన్ని రకాల విస్కీ, బ్రాందీలకు కృత్రిమ కొరత సృష్టిస్తుండటం విశేషం! ఈ తరహా బ్రాండ్లను ఒక్కొక్క బాటిల్‌పై కనీసం 20నుండి 40రూపాయలు అధికంగా విక్రయిస్తున్నట్టు పలువురు చెబుతున్నారు. ఈ సంక్రాంతి సీజన్లో వారం రోజుల పాటు పల్లెల్లో చీప్ లిక్కర్ ఏరులై పారినట్టు తెలిసింది. అది కూడా అధిక ధరకే విక్రయాలు జరిగాయి. బెల్ట్‌షాపుల ద్వారా పెద్ద ఎత్తున చీప్ లిక్కర్ ఏరులై పారినట్టు తెలుస్తోంది. జిల్లాలో సుమారు 500 అధికారిక మద్యం దుకాణాలున్నాయి. బెల్ట్‌షాపులు లెక్కకు మిక్కిలివున్నాయి. నగరాలు, పట్టణాల్లో జనావాసాల మధ్య బార్లు ఏర్పాటుచేసేందుకు లైసెన్స్‌లిచ్చారు. దీంతో జనం ముంగిటకే మద్యం అనే నినాదంతో వ్యాపారం సాగుతోంది. వైన్‌షాపుల వద్దే పర్మిట్ రూంల పేరుతో బార్లు నిర్వహిస్తున్నారు. పలు పట్టణాల్లోని ప్రథాన కూడళ్ళలో ఓ పద్ధతంటూ లేకుండా ఒకేచోట నాలుగైదు మద్యం దుకాణాలు, బార్లు ఏర్పాటుచేసుకునేందుకు అనుమతులిచ్చారు. సంక్రాంతి నేపథ్యంలో రేయింబవళ్ళు ఆయా బార్లు, దుకాణాలు మద్యంప్రియులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.