బిజినెస్

మరిన్ని సహారా ఆస్తుల వేలానికి సెబీ రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 9: చెల్లింపుల సంక్షోభంలో కూరుకుపోయిన సహారా ఇండియానుంచి తమకు రావలసిన సొమ్మును రాబట్టడానికి ఇప్పటికే ఆ సంస్థకు చెందిన సుమారు 1200 కోట్ల రూపాయల విలువైన భూములను అమ్మకానికి పెట్టిన సెబి మరో రూ. 1900 కోట్ల విలువైన 16 ఆస్తులను వచ్చేనెల అమ్మకానికి సిద్ధం చేసింది. దీంతో ఇప్పటివరకు అమ్మకానికి పెట్టిన సహారా ఆస్తుల విలువ 3,100 కోట్లకు చేరుకుంది. అంతే విలువ కలిగిన మరిన్ని ఆస్తులను కూడా రాబోయే రోజుల్లో అమ్మకానికి పెట్టవచ్చని తెలుస్తోంది. జూలై 13న ఎస్‌బిఐ క్యాప్స్ రూ. 1196 కోట్ల విలువైన ఎనిమిది ఆస్తులను వేలం వేస్తుందని, అలాగే హెచ్‌డిఎఫ్‌సి రియల్టీ జూలై 15న రూ. 702 ఓట్ల విలువైన మరో ఎనిమిది ఆస్తులను ఈ-వేలం వేస్తుందని సెబి తెలిపింది. ఈ రెండు కంపెనీలు జూలై 4, 7 తేదీల్లో విడివిడిగా నిర్వహించే వేలంలో రూ. 1200 కకోట్ల విలువైన అయిదు ఆస్తులను విక్రయించనున్న విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాల మేరు సహారా గ్రూపునకు చెందిన ఆస్తులను వేలం వేయడానికి సెబి ఎస్‌బిఐ క్యాప్స్, హెచ్‌డిఎఫ్‌సి రియల్టీ సంస్థలకు అధికారమిచ్చిన విషయం తెలిసిందే. రూ.2400 ఓట్ల విలువైన 31 ఆస్తులను సెచ్‌డిఎఫ్‌సి రియల్టీ విక్రయించనుండగా, రూ. 4,100 కోట్ల విలువైన మరో 30 భూములను ఎస్‌బిఐ క్యాప్స్ విక్రయించనుంది.

చిత్రం సహారా అధినేత సుబ్రతా రాయ్