బిజినెస్

సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 18: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలకు ఈసారి బడ్జెట్‌లో రాష్ట్రానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. గురువారం 2018-19 సంవత్సరానికిగాను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో ప్రీ బడ్జెట్ సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో ఈటల రాజేందర్ పాల్గొని, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అభిప్రాయాలను, పలు విజ్ఞప్తులను చేశారు. అనంతరం తెలంగాణ భవన్‌లో విలేఖరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సంక్షేమ పథకాలను అమలుచేసే విషయంలో దేశంలోనే ఆదర్శంగా నిలుస్తోందని, అందుకు తగినవిధంగా బడ్జెట్‌లో కేటాయింపులు చేయాలని విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా కొత్త పథకాల అమలు, అవిష్కరణలకు ఈ బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి మద్దతు ఇవ్వాలని కోరినట్టు ఆయన వెల్లడించారు. దేశంలో యువతకు ఉపాధి అవకాశాలున్న వ్యవసాయ, మధ్య తరగతి పరిశ్రమల రంగాలకు ఈ బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికీ నీరు అందించాలన్న సంకల్పంతో చేపట్టిన మిషన్ భగీరధ పథకానికి రూ.19,205కోట్ల సాయం చేయాలని నీతి ఆయోగ్ కేంద్రానికి సిఫార్సు చేసిన విషయాన్ని ఈ సమావేశంలో ప్రస్తావించినట్టు చెప్పారు. దానితోపాటుగా తెలంగాణలో చెరువులు, కుంటలను పునరుద్ధరించేందుకు మిషన్ కాకతీయ పథకం కింద ఐదువేల కోట్ల రూపాయలు ఇవ్వాలని నీతి అయోగ్ సిఫార్సు చేసిన విషయాన్నీ కేంద్రం దృష్టికి తీసుకొచ్చినట్లు చెప్పారు. రాష్ట్రంలో రైల్ కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయం, హార్టికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటు, గతంలో పార్లమెంట్‌లో ప్రకటించిన ఎయిమ్స్‌కు నిధులు ఈ బడ్జెట్‌లో కేటాయించాలని విజ్ఞప్తి చేసినట్టు పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు పదివేల కోట్లు కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరినట్టు చెప్పారు. అలాగే హైదరాబాద్ మినహా మిగిలిన 30 జిల్లాలను వెనుకబడినవిగా గుర్తించి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు.
పేద ప్రజలు ఉపయోగించే వస్తువులకు అధిక శాతం పన్నుల శ్లాబ్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు. గురువారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్నట్టు ఈటల తెలిపారు. బీడీలపై ప్రస్తుతం ఉన్న 28 శాతం పన్నును తగ్గించాలని ఈ సమావేశంలో విజ్ఞప్తి చేశామని, దాన్ని కేంద్రం తోసిపుచ్చిందని తెలిపారు. ఫిట్‌మెంట్ కమిటీ ఇచ్చిన ప్రతిపాదనల్లో సగం వస్తువులపై పన్ను శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. వ్యవసాయ రంగంలో బిందు సేద్యానికి ఉపయోగించే పరికరాలపై ఉన్న జీఎస్టి 18 నుంచి 12 శాతానికి తగ్గించారని చెప్పారు. అంతరాష్ట్ర ఈ-వే బిల్లుల విషయంలో పాత పద్ధతినే కొనసాగించాలని సమావేశంలో అందరూ కోరినట్టు చెప్పారు. జీఎస్టీ అమలువల్ల ఉత్పన్నం అవుతున్న సమస్యలపై వచ్చే సమావేశంలో మరోసారి చర్చిస్తారని వెల్లడించారు. ఈ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ రాష్ట్రానికి సభ్యత్యం ఇచ్చినట్టు వెల్లడించారు.

చిత్రం..న్యూఢిల్లీలో గురువారం జరిగిన ప్రీ బడ్జెట్ సమావేశంలో పాల్గొన్న తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్