బిజినెస్

భవిష్యత్తులో అంతా సానుకూలమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, జనవరి 18: వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ), పెద్ద నోట్ల రద్దు సహా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వివిధ నిర్ణయాలు రానున్న కాలంలో సానుకూల ప్రభావం చూపుతాయని ఉప రాష్టప్రతి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ‘ఈ చర్యల వల్ల తొలి దశలో ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు నాకు తెలుసు. అయితే ఆ సమస్యలన్నీ త్వరలోనే పరిష్కారం అవుతాయని నేను గట్టిగా చెప్పగలను’ అని ఆయన అన్నారు. జీఎస్‌టీ మండలి.. ఎగుమతిదారులు ఆందోళన చెందుతున్న సమస్యలను పరిష్కరిస్తుందని పేర్కొం టూ, ఎగుమతిదారులు కొత్త మార్కె ట్లు, కొత్త ఉత్పత్తులపై కేంద్రీకరించాలని ఆయన పిలుపునిచ్చారు. గురువారం ఇక్కడ జరిగిన ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్‌ఐఈఓ) సదరన్ రీజియన్ ఎక్స్‌పోర్ట్ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానం కార్యక్రమంలో వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ప్రపంచ వాణిజ్యంలో అధిక వృద్ధి గల సన్‌రైజ్ ప్రొడక్ట్స్ సహా కొత్త ఉత్పత్తులు, కొత్త మార్కెట్లపై దేశ ఎగుమతిదారులు కేంద్రీకరించాలని సూచించారు. వృద్ధి సంఘటితంగా ఉండి తీరాలని, దాని ఫలితాలు సామాన్య ప్రజలకు అందాలని ఆయన పేర్కొన్నారు. వృద్ధి ఫలితాలు సామాన్య ప్రజలకు కూడా చేరాలని, అభివృద్ధి ప్రక్రియలో తాము కూడా భాగస్వాములమని వారు భావించాలని అన్నారు. ప్రాచీన కాలంలోనే భారత్ ప్రపంచ వాణిజ్యంలో కీలక పాత్ర పోషించిందని పేర్కొంటూ, మళ్లీ పూర్వవైభవాన్ని సంతరించుకోవడానికి ప్రతి ఒక్కరు కలిసి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజలు మాతృభాషకు ప్రాధాన్యత ఇవ్వాలని, అయితే అదే సమయంలో అనేక భాషలను నేర్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజలు భిన్న భాషలను నేర్చుకోవడాన్ని ఎవరూ అడ్డుకోజాలరని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ‘మన్ కీ బాత్’ ప్రసంగంలో ఉత్తర భారతదేశ ప్రజలు.. దక్షిణ భారత దేశానికి చెందిన ఒక్క భాషనయినా నేర్చుకోవాలని పిలుపునిచ్చారని వెంకయ్య నాయుడు ఈ సందర్భంగా గుర్తుచేశారు.