బిజినెస్

ఏపీ ఆఫ్-కోర్సు టోటె సెంటర్ల ఏర్పాటుకు అనుమతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 19: రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఆఫ్-కోర్సు టోటె సెంటర్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ రేస్ క్లబ్ నిర్వహించే వింటర్, మాన్‌సూన్ రేస్ కోర్సులకు సంబంధించి బెట్టింగ్, చూసేందుకు టికెట్లను విక్రయించేందుకు వీలుగా ఆఫ్-కోర్సు టోటె సెంటర్లను రాష్ట్రంలో విజయవాడ, గుంటూరు, కాకినాడ, కర్నూల్, రాజమహేంద్రవరం, విశాఖపట్నంలో ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. ఇందుకు లైసెన్సు ఫీజుగా సంవత్సరానికి 5 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. హైదరాబాద్ రేస్ క్లబ్ సహా, చెన్నై, ఊటీ, మైసూరు, ముంబయి, పూనే, కోల్‌కతా, ఢిల్లీ హార్స్ రేసులకు కూడా బెట్టింగ్ వంటివి నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. వివిధ ప్రాంతాల్లో నిర్వహించే హార్స్ రేస్‌లను ఆయా టోటె సెంటర్లలో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. లైసెన్సు జారీ చేయడం ద్వారా బెట్టింగ్‌లను అధికారికంగా చేయవచ్చు. ఈ రేస్‌లను చూసే వీలు కలుగుతుంది. గతంలో ఈ సెంటర్ల నిర్వహణపై విమర్శలు రావడంతో అనుమతి మంజూరు చేయలేదు.