బిజినెస్

వరుసగా ఏడోవారమూ లాభాలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 20: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఏడో వారం పుంజుకున్నా యి. కీలక సూచీలు కొత్త మైలురాళ్లను అధిగమించాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ ఈ వారం 919.19 పాయింట్లు పుంజుకొని, సరికొత్త జీవనకాల రికార్డు స్థాయి 35,511.58 పాయింట్ల వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ కూడా ఆల్-టైమ్ హై 10,894.70 పాయింట్ల వద్ద స్థిరపడింది. మంగళవారం చోటు చేసుకున్న కొన్ని ప్రాఫిట్ బుకింగ్‌లను మినహాయిస్తే, ఈ వారమంతా బుల్ రన్ కొనసాగింది. అన్ని రకాల షేర్లు మదుపరులను ఆకట్టుకోలేక పోయినప్పటికీ, బ్యాంకింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజి (ఐటీ), టెక్నాలజి రంగాల షేర్లలో ఎక్కువగా కొనుగోళ్లు జరిగాయి. స్థూల ఆర్థిక గణాంకాలు, స్టాక్ మార్కెట్‌కు సంబంధించిన వార్తలు సానుకూలంగా ఉండటంతో ఈ రంగాల షేర్ల పట్ల మదుపరులు మక్కువ చూపారు. గత శుక్రవారం వెలువడిన స్థూల ఆర్థిక గణాంకాలలో పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) నవంబర్ నెలలో 17 నెలల గరిష్ఠ స్థాయికి పెరగడం వల్ల మదుపరులలో ఆశావాద దృక్పథం ఇనుమడించింది. ముడి చమురు ధరల్లో అనిశ్చితి, ఆర్థిక వృద్ధి పడిపోతుందనే ఆందోళనతో పాటు వాణిజ్య లోటు పెరగడం వంటి అంశాలు కొంత ప్రతికూలంగా మారినప్పటికీ, ఈ ఆర్థిక సంవత్సరం అదనంగా తేవలసిన అవసరం ఉన్న అప్పుల పరిమాణాన్ని ప్రభుత్వం తగ్గించడంతో పాటు బ్యాంకింగ్ రంగంలో వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐల)కు ఆమోదం లభించిందని మీడియాలో వచ్చిన సానుకూల వార్తల వల్ల స్టాక్ మార్కెట్‌లో ప్రతికూల ప్రభావం బాగా తగ్గిపోయింది. కొన్ని వస్తువులు, సేవలపై పన్ను రేటును తగ్గిస్తూ వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) మండలి తీసుకున్న నిర్ణయంతో స్టాక్ మార్కెట్ సూచీలు బాగా పుంజుకున్నాయి. ప్రపంచ స్టాక్ మార్కెట్లలో సానుకూల ధోరణి, ముడి చమురు ధరలు తగ్గడంతో పాటు కొన్ని కీలక బ్లూచిప్‌లు మూడో త్రైమాసికంలో మంచి లాభాలను గడించడం మార్కెట్‌కు మరింత చోదకశక్తిని అందించింది.
సెనె్సక్స్ ఈ వారం 34,687.21 పాయింట్ల అధిక స్థాయి వద్ద ప్రారంభమయి, కొత్త మైలురాయి రికార్డు గరిష్ఠ స్థాయి 35,542.17, కనిష్ఠ స్థాయి 34,687.21 పాయింట్ల మధ్య కదలాడింది. చివరకు క్రితం వారం ముగింపుతో పోలిస్తే 919.19 పాయింట్ల (2.66 శాతం) లాభంతో 35,511.58 పాయింట్ల సరికొత్త జీవనకాల గరిష్ఠ స్థాయి వద్ద ముగిసింది. సెనె్సక్స్ గత వారం 2,120.25 పాయింట్లు (6.46 శాతం) లాభపడింది. నిఫ్టీ కూడా ఈ వారం 10,718. 50 పాయింట్ల అధిక స్థాయి వద్ద ప్రారంభమయి, మైలురాయి 10, 906.85 పాయింట్లు, కనిష్ట స్థాయి 10,666.75 పాయింట్ల మధ్య కదలాడింది. చివరకు క్రితం వారం ముగింపుతో పోలిస్తే 213.45 పాయింట్ల (2.00శాతం) పెరుగుదలతో సరికొత్త రికార్డు గరిష్ఠ స్థాయి 10,894.70 పాయింట్ల మధ్య ముగిసింది. బ్యాం కులు, ఐటీ, టెక్, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్‌ఎంసీజీ రంగాల షేర్ల నేతృత్వంలో కొనుగోళ్లు జరిగాయి. స్థిరాస్తి, లోహ, చమురు- సహజ వాయువు, విద్యుత్తు, వాహన, ప్రభు త్వ రంగ సంస్థలు, కన్స్యూమర్ డ్యూరేబుల్స్, ఐపీఓలు, ఆరోగ్య సం రక్షణ రంగాల షేర్లలో మదుపరు లు ప్రాఫిట్ బుకింగ్‌లకు పాల్పడ్డారు.