బిజినెస్

హెచ్‌పీసీఎల్‌లోని ప్రభుత్వ వాటా ఓఎన్‌జీసీ వశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 20: చమురు శుద్ధి సంస్థ హెచ్‌పీసీఎల్‌లో కేంద్ర ప్రభుత్వానికి ఉన్న మొత్తం వాటా 51.11 శాతాన్ని రూ. 36,915 కోట్లకు కొనుగోలు చేస్తున్నట్టు ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ) శనివారం వెల్లడించింది. ఈ వాటాలపై పది శాతానికి పైగా ప్రీమియం చెల్లిస్తున్నట్టు పేర్కొంది. హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌లోని 77.8 కోట్ల మొత్తం ప్రభుత్వ షేర్లను స్వాధీనం చేసుకోవడానికి ఒక్కో షేర్‌కు రూ. 473.97 చొప్పున చెల్లించనున్నట్టు ఓఎన్‌జీసీ.. స్టాక్ ఎక్స్చేంజీలో సమర్పించిన ఒక అధికారిక పత్రంలో వివరించింది. హెచ్‌పీసీఎల్ ఒక్కో షేర్‌కు శుక్రవారం నాటి ముగింపు ధరతో పోలిస్తే 14 శాతం ఎక్కువగా ధర చెల్లిస్తోంది. ఈ షేర్ 60 రోజుల సగటు ధరకన్నా పది శాతం ఎక్కువగా చెల్లిస్తోంది. పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో తన షేర్ల విక్రయానికి పెట్టుకున్న లక్ష్యాన్ని ఈ లావాదేవీతో అధిగమిస్తుంది. ప్రభుత్వం ఆఫ్-మార్కెట్ డీల్ ద్వారా తన షేర్ల విక్రయాన్ని ప్రారంభించినప్పటి నుంచి లక్ష్యాన్ని అధిగమించడం ఇదే మొదటిసారి. ప్రభుత్వం హెచ్‌పీసీఎల్‌లోని తన వాటాల అమ్మకం ద్వారా రూ. ఒక లక్ష కోట్లు రాబట్టాలని వాటి అమ్మకానికి చర్చలు ప్రారంభించినప్పుడు భావించింది. అయితే, ఇప్పుడు ఓఎన్‌జీసీ మాత్రం దాంతో పోలిస్తే, చాలా తక్కువ చెల్లిస్తోంది. ఓఎన్‌జీసీ బాగా బేరమాడటం ద్వారా హెచ్‌పీసీఎల్ షేర్ విలువను బాగా తగ్గించి, కొనుగోలు చేసిందని భావిస్తున్నారు.