బిజినెస్

క్యూ3 ఫలితాలే కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 21: యాక్సిస్ బ్యాంక్, మారుతి సుజుకి వంటి బ్లూచిప్‌లు మూడో త్రైమాసికంలో (క్యూ3లో) ఆర్జించే లాభాలతో పాటు డెరివేటివ్‌ల కాలపరిమితి ముగింపు సోమవారం నుంచి మొదలయ్యే వారంలో దేశీయ స్టాక్ మార్కెట్ సరళిని ప్రభావితం చేయనున్నాయని నిపుణులు పేర్కొన్నారు. శుక్రవారం గణతంత్ర దినోత్సవం వస్తున్నందున ఆ రోజున స్టాక్ మార్కెట్లు పని చేయవు. అందువల్ల ఈ వారంలో కేవలం నాలుగు రోజులే మార్కెట్లు పనిచేస్తాయి. ‘ఈ సంవత్సర మూడో త్రైమాసిక ఫలితాలతో పాటు ఫిబ్రవరి ఒకటో తేదీన ప్రవేశపెట్టనున్న సాధారణ బడ్జెట్‌పైనా మార్కెట్ల దృష్టి కొనసాగుతుంది. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్‌అండ్‌ఓ) కాలపరిమితి జనవరి 25న ముగుస్తున్నందున స్టాక్ మార్కెట్లలో అనిశ్చితి కూడా చోటు చేసుకునే అవకాశం ఉంది’ అని కొటక్ సెక్యూరిటీస్ రీసెర్చ్ విభాగం వైస్ ప్రెసిడెంట్ టీనా విర్మాని తెలిపారు. ‘ముందున్న వారంలో మార్కెట్ మూడో త్రైమాసిక ఫలితాల పురోగతిని సునిశితంగా పరిశీలిస్తుంది. ఈ ఫలితాలే మొత్తంమీద ఈ వారం మార్కెట్ ధోరణిని నిర్దేశిస్తాయి. ఎఫ్‌అండ్‌ఓ కాలపరిమితి ముగియనుండటంతో ఈ వారంలో అనిశ్చితి పెరిగే అవకాశం కూడా ఉంది’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ విభాగం అధిపతి వినోద్ నాయర్ అంచనా వేశారు. యాక్సిస్ బ్యాంక్, మారుతి సుజుకి ఇండియా, కెనరా బ్యాంక్, ఐడియా సెల్యులార్, కోల్ ఇండియా, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ మొదలగు సంస్థలు ఈ వారంలో తమ మూడో త్రైమాసిక ఫలితాలను వెల్లడించనున్నాయి. ‘మార్కెట్‌ను ప్రభావితం చేయనున్న మరో కీలకమైన అంశం బడ్జెట్. బడ్జెట్ ఈ వారం మార్కెట్‌లో అనిశ్చితిని పెంచుతుంది. మార్కెట్ కీలక సూచీల కదలికల విస్తృతి కూడా పెరిగే అవకాశం ఉంది’ అని ఎపిక్ రీసెర్చ్ కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) ముస్త్ఫా నదీమ్ పేర్కొన్నారు. శుక్రవారంతో ముగిసిన వారంలో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 919.19 పాయింట్లు (2.65 శాతం) పెరగగా, నిఫ్టీ 213.45 పాయింట్లు (1.99 శాతం) పుంజుకుంది.