బిజినెస్

ఐటీలో తెలంగాణ విజృంభణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 21: తెలంగాణ ఐటీ రంగం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో ఐటీ ఎగుమతులు రూ.97వేల కోట్లకు చేరనున్నాయి. తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత మునుపెన్నడూ లేని విధంగా మూడేళ్లలో రూ.30 వేల కోట్ల మేర ఐటి ఎగుమతుల విలువ పెరిగింది. ప్రస్తుతం దేశంలో ఐటి రంగంలో బెంగళూరు ప్రథమ స్థానంలో, మహారాష్ట్ర ద్వితీయ స్థానంలో, తెలంగాణ (హైదరాబాద్) మూడో స్థానంలో ఉన్నాయి. 2014-15లో రూ.64 వేల కోట్లతో వృద్ధిరేటు 11.77 శాతాన్ని ఐటి రంగం నమోదు చేసింది. 2015-16లో రూ.75070 కోట్లతో 17.29 శాతం వృద్ధిరేటును నమోదు చేసింది. 2016-17లో రూ.85,470 కోట్లతో 13.85 శాతం వృద్ధిరేటును నమోదు చేసినట్లు ఐటి శాఖ వర్గాలు తెలిపాయి. కాగా ఈ ఏడాది 14 శాతం వృద్ధిరేటుతో దాదాపు రూ.97వేల కోట్లకు ఐటి ఎగుమతులు ఎగబాకనున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ ఐటి రంగంలో 4.5 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ రంగం వల్ల 10 లక్షల మంది పరోక్ష ఉపాధి పొందుతున్నారు. గత ఏడాది జూలై నుంచి డిసెంబర్ వరకు ఐటి స్పేస్ రంగం రియాల్టీ రంగంలో దూసుకుపోయింది. దాదాపు 3.34 మిలియన్ల చదరపు అడుగుల మేర విస్తీర్ణంలో కొత్తగా ఐటి పరిశ్రమలు వచ్చాయి. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్‌లో కూడా ఐటి కంపెనీలు వస్తున్నాయి. ఐటి కంపెనీలు రాష్ట్రం లో రెండవ టైర్ పట్టణాలకు విస్తరించడం శుభసూచకమని సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్కు ఆఫ్ ఇండియా డైరెక్టర్ సివిడి రాంప్రసాద్ తెలిపారు. 2020 నాటికి రూ.1.20 లక్షల కోట్లకు ఐటి ఉత్పత్తుల ఎగుమతి పెరిగే అవకాశం ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అదనంగా నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు, పరోక్షంగా అదనంగా పదిలక్షల మందికి ఉపాధి కల్పించేందుకు వీలుగా కొత్త ఐటి విధానం ఉంది.