బిజినెస్

థియేటర్లలో ‘జనతా కర్ఫ్యూ’ తప్పదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, జనవరి 22: వివాదాస్పద హిందీ చలనచిత్రం ‘పద్మావత్’ను ఉత్తరప్రదేశ్‌లో నిషేధించాలని కర్ణిసేన పోషకుడు లోకేంద్రసింగ్ కల్వీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను ఇక్కడ సోమవారం కలిసిన సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఈ సినిమాను యుపీలో విడుదల చేస్తే థియేటర్లలో ప్రజలే ‘జనతా కర్ఫ్యూ’ను అమలు చేస్తారని ఆయన ప్రకటించారు. సుమారు 20 నిమిషాల సేపు యోగితో చర్చించిన అనంతరం లోకేంద్రసింగ్ మీడియాతో మాట్లాడుతూ, ‘పద్మావత్’కు సంబంధించి తాము 40 అభ్యంతరాలను లేవనెత్తామని తెలిపారు. అవాస్తవాలతో ఇలాంటి సినిమాలు తీసే బదులు మహారాణా ప్రతాప్, ఛత్రపతి శివాజీ వంటి వీరుల జీవితచరిత్రలను చలనచిత్రాలుగా తీయాలని ఆయన అన్నారు. ‘పద్మావత్’ను నిషేధించాలని తాము ఇదివరకే ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశామని, ఆయన సానుకూలంగా స్పందిస్తారని తాము ఆశిస్తున్నట్లు లోకేంద్రసింగ్ చెప్పారు. సుప్రీం కోర్టు తీర్పును యుపి సీఎం అమలు చేయాల్సి ఉన్నప్పటికీ, వ్యక్తిగతంగా ఆయన తమ డిమాండ్‌ను సమర్థించారని తెలిపారు. పద్మావతి పక్షాన నిలవాలో, అల్లాడీన్ ఖిల్జీ పక్షాన నిలవాలో జనం తేల్చుకోవాలన్నారు. రామరావణుల్లో ఎవరు గొప్పవారో తెలిసిన ప్రజలు సరైన నిర్ణయం తీసుకుంటారన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నందున ఈ సినిమా ప్రదర్శనకు అనుమతి ఇవ్వరాదంటూ కర్ణిసేన కార్యకర్తలు లక్నో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. చారిత్రక వాస్తవాలకు వక్రభాష్యం చెప్పిన సినిమా కొన్ని సామాజిక వర్గాలకు వ్యతిరేకంగా ఉందని వారు ఫిర్యాదు చేశారు.

చిత్రం..విలేఖరులతో మాట్లాడుతున్న లోకేంద్రసింగ్ కల్వీ