బిజినెస్

పెట్టుబడులకు కొరియా ఆసక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 22: మన దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు కొరియాకు చెందిన అనేకమంది పారిశ్రామికవేత్తలు అసక్తిగా ఉన్నారని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు జి. వివేక్ తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అనుకూల పరిస్థితుల గురించి కొరియాలో పారిశ్రామికవేత్తలకు వివరించినట్లు ఆయన చెప్పారు. పెట్టుబడులు పెట్టేవారికి రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన సౌకర్యాల గురించి వివరించినట్లు తెలిపారు. రాష్ట్రంలో కొరియా భాషా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర మంత్రి తారక రామారావు చెప్పారని తెలిపారు. తెలంగాణలో టెక్స్‌టైల్ రంగానికి మంచి మార్కెట్ ఉందన్నారు. హైదరాబాద్‌లో ఫ్యాషన్ సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. టెక్స్‌టైల్ పార్కుల్లో తయారు చేసిన వాటిని ఫ్యాషన్ సిటీలో ప్రదర్శిస్తామన్నారు. క్లీన్ ఎనర్జీ, పౌల్ట్రీకి సంబంధించిన ఒప్పందాలు సుజుకి సంస్థతో చర్చలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. హ్యుందాయ్ కంపెనీ ప్రతినిధులతో కూడా మంత్రి కేటీఆర్ చర్చలు జరుపుతున్నారని వివేక్ చెప్పారు.