బిజినెస్

హెచ్‌పీసీఎల్ చేతికి ఎంఆర్‌పీఎల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 22: ప్రభుత్వ రంగ చమురు శుద్ధి కంపెనీ అయిన హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) నగదు, షేర్ల మార్పిడి ఒప్పందం ద్వారా మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ (ఎంఆర్‌పీఎల్)ను స్వాధీనం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రక్రియ పూర్తయితే హెచ్‌పీసీఎల్ దేశంలో మూడో అతిపెద్ద చమురు శుద్ధి కంపెనీగా అవతరిస్తుంది. దేశంలోని అతిపెద్ద చమురు, సహజ వాయువు ఉత్పత్తిదారు అయిన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ) గత వారం రూ. 36,915 కోట్లకు హెచ్‌పీసీఎల్‌ను స్వాధీనం చేసుకుంటున్నట్టు ప్రకటించింది. ఈ స్వాధీనం అనంతరం ఓఎన్‌జీసీకి రెండు చమురు శుద్ధి అనుబంధ సంస్థలు- హెచ్‌పీసీఎల్, ఎంఆర్‌పీఎల్ ఉంటాయి. ‘హెచ్‌పీసీఎల్‌లోకి ఎంఆర్‌పీఎల్ వస్తే మేము ఎంతో సమన్వయాన్ని, సహకారాన్ని పెంపొందించుకోగలం’ అని హెచ్‌పీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ కుమార్ సూరన పేర్కొన్నారు. హెచ్‌పీసీఎల్‌ను స్వతంత్ర లిస్టెడ్ కంపెనీగా నిర్వహించడానికి ఓఎన్‌జీసీ ప్రణాళిక రూపొందించింది. ‘మాకు ఎంఆర్‌పీఎల్ కొత్త కంపెనీ కాదు. ఏవీ బిర్లా గ్రూపులోని జాయింట్ వెంచర్‌ను 2003లో ఓఎన్‌జీసీ స్వాధీనం చేసుకోవడానికి ముందు ఇది హెచ్‌పీసీఎల్‌కు చెందిన కంపెనీయే. మేము ఎంఆర్‌పీఎల్‌లోని దాదాపు 17 శాతం వాటాను స్వాధీనం చేసుకుంటాము. అందువల్ల ఆ కంపెనీ గురించి మాకు మంచి అవగాహన ఉంటుంది’ అని ముకేశ్ కుమార్ ఒక వార్తాసంస్థతో మాట్లాడుతూ అన్నారు. ‘ఓఎన్‌జీసీ ప్రయోజనాల రీత్యా ఈ విలీనం చాలా మంచి అంశం’ అని పేర్కొన్నారు.