బిజినెస్

వరుస లాభాలకు బ్రేక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 11: దేశీయ స్టాక్ మార్కెట్లు గడచిన వారం నష్టాలపాలయ్యాయి. వరుసగా రెండు వారాలపాటు లాభాల్లో కొనసాగిన సూచీలు గడచిన వారం మాత్రం నిరాశపరిచాయి. అమ్మకాలు, కొనుగోళ్ల మధ్య మదుపరుల ఊగిసలాటతో బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 207.28 పాయింట్లు క్షీణించి 26,635.75 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 8,200 స్థాయికి దిగువన 50.75 పాయింట్లు పడిపోయి 8,170.05 వద్ద నిలిచింది. నిజానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) ద్వితీయ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచినప్పటికీ అంతర్జాతీయ సానుకూల సంకేతాల మధ్య సూచీలు లాభాలను అందుకున్నాయి. అయితే అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు భయాలు, అంతర్జాతీయ మార్కెట్‌లో పెరుగుతున్న ముడి చమురు ధరలు మదుపరులను అమ్మకాల ఒత్తిడికి గురిచేశాయి. వచ్చేవారం జరిగే సమీక్షలో కీలక వడ్డీరేట్లపై ఫెడ్ రిజర్వ్ తీసుకునే నిర్ణయం.. దేశీయ స్టాక్ మార్కెట్లపై గడచిన వారం నుంచే ప్రభావం చూపింది మరి. ఇక యూరోపియన్ యూనియన్ (ఇయు) నుంచి బ్రిటన్ వైదొలగడంపై ఈ నెల 23న రెఫరెండమ్ జరగనుండగా, ఆ ప్రభావం కూడా సూచీలను ప్రభావితం చేసింది. ఇకపోతే ఐటి, టెక్నాలజీ, హెల్త్‌కేర్, ఆటో, ఎఫ్‌ఎమ్‌సిజి రంగాల్లో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. అయితే పవర్, మెటల్, క్యాపిటల్ గూడ్స్, రియల్టీ, పిఎస్‌యు, బ్యాంకింగ్, చమురు, గ్యాస్ రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. కాగా, విదేశీ పోర్ట్ఫోలియో మదుపరులు (ఎఫ్‌పిఐ) గడచిన వారం 1,613.56 కోట్ల రూపాయల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. ఈ మేరకు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ గణాంకాలు తెలియజేస్తున్నాయి. టర్నోవర్ విషయానికొస్తే గడచిన వారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ 13,530.99 కోట్ల రూపాయలుగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ 83,977.77 కోట్ల రూపాయలుగా ఉంది. అంతకుముందు వారం బిఎస్‌ఇ టర్నోవర్ 14,092.84 కోట్ల రూపాయలుగా, ఎన్‌ఎస్‌ఇ టర్నోవర్ 1,07,042.86 కోట్ల రూపాయలుగా ఉంది.