బిజినెస్

‘సింగరేణి’లో రక్షణ చర్యలపై మరింత అవగాహన అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని, జనవరి 23: సింగరేణి బొగ్గు పరిశ్రమలో రక్షణ చర్యలపై మరింత అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ ఎస్‌కె దత్తా సూచించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని సింగరేణి జవహార్ లాల్ నెహ్రూ క్రీడా మైదానంలో మంగళవారం రాత్రి సింగరేణి 50వ వార్షిక రక్షణ వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా బహుమతి ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్‌కె.దత్తా జ్యోతి ప్రజ్వలన అనంతరం బొగ్గు గని కార్మికులను, అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రమాదాల్లో చిన్నవి... పెద్దవి అనేవి ఉండవని, అన్నింటినీ ఒకేలాగా తీసుకోవాలని, ప్రమాదాలకు చోటు లేకుండా ఉత్పత్తి జరపాలని అన్నారు. గని కార్మికులకు రక్షణ చర్యలపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలని పేర్కొంటూ గత ఏడాది కంటే ప్రస్తుతం సింగరేణిలో ప్రమాదాల సంఖ్య పెరిగిందని, రక్షణ విషయాల్లో మైన్స్ అండ్ సేఫ్టీతో సింగరేణి ఎప్పటికీ అందుబాటులో ఉండాలని అన్నారు. సింగరేణి డైరెక్టర్ (పా) పవిత్రన్ కుమార్ మాట్లాడుతూ... సింగరేణి బొగ్గు పరిశ్రమలో ప్రమాదాలకు తావు లేకుండా చర్యలు తీసుకోవడంతోపాటు సూత్రాలన్ని కూడా పాటిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి డైరెక్టర్లు శంకర్, భాస్కర్ రావు, చంద్రశేఖర్, విజయ్ కుమార్, నర్సయ్య, క్రిష్ణ ప్రసాద్, వసంత కుమార్, జి ఎంలు విజయపాల్ రెడ్డి, విజయబాబు, రాజేందర్ రెడ్డి, సంఘాల ప్రతినిధులు వెంకట్రావ్, గట్టయ్యతోపాటు వేలాది మంది కార్మికులు, కార్మిక కుటుంబాలు పాల్గొన్నాయి.