బిజినెస్

‘మిడ్‌టెక్’ సెంటర్ ప్రతినిధులతో బాబు భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 23: గత ఏడాది ఈడీబీతో అవగాహన ఒప్పం దం చేసుకున్న మిడ్‌టెక్ ఇన్నోవేషన్ సంస్థ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు దావోస్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా 50 సంస్థలతో లెటర్ ఆఫ్ ఇంటెంట్ చేసుకుంది. 150 కంపెనీలను ఏపీకి తీసుకురావాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని తొలిదశలో 60 సంస్థలను తీసుకువచ్చేందుకు సంప్రదింపులు పూర్తిచేశామని సంస్థ ప్రతినిధులు చెప్పారు. కేవలం పెట్టుబడులను తీసుకురావడమే కాకుండా ఆ సంస్థలకు ఆశాజనకంగా ఉండేలా ఏపీలో ఎకో సిస్టమ్ ఏర్పాటుకు ప్రయత్నం చేస్తున్నామని, అత్యున్నత సాంకేతిక నైపుణ్యం గలవారు, శాస్త్ర నిపుణులతో 45 నుంచి 50వేలకు పైగా ఉద్యోగాల కల్పన, దీనికి రెట్టింపు సంఖ్యలో పరోక్ష ఉద్యోగాల కల్పన ధ్యేయంగా పనిచేస్తున్న మిడ్‌టెక్ ఇన్నోవేషన్ సెంటర్ పని చేస్తోందని వారు సీఎంకు తెలిపారు. వైజాగ్ మిడ్‌టెక్ పార్కులో భాగస్వామ్యం తీసుకుని క్రమంగా విస్తరణకు మిడ్‌టెక్ ప్రణాళికలు రూపొందించనుంది. అందులో భాగంగా యూరోపియన్ సెగ్మెంట్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.