బిజినెస్

స్టాక్‌మార్కెట్ సంచలనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 23: దేశీయ స్టాక్‌మార్కెట్లలో సంచలనాల పరంపర కొనసాగుతోంది. గత వారం రోజులుగా దూకుడు మీదున్న సూచీలు ఈ వారం కూడా అదే జోరును కొనసాగిస్తున్నాయి. అంతకంతకూ దూసుకుపోతూ లభాల తీరాలను తాకుతున్నాయి. 2018- 2019 సంవత్సరాల్లో ప్రపంచంలోనే అత్యంత వేగంగా దూసుకుపోతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని ‘అంతర్జాతీయ ద్రవ్యనిధి’ (ఐఎంఎఫ్) ప్రకటించిన నేపథ్యంలో నిఫ్టీ, సెనె్సక్స్ దూకుడును కొనసాగించడం గమనార్హం. దావోస్‌లో ప్రపంచ ఆర్థికవేత్తల సదస్సు ప్రారంభమైన సందర్భంగా ‘వరల్డ్ ఎకనమిక్ అవుట్‌లుక్’ (డబ్ల్యుఇఓ) వివిధ దేశాల్లో ఆర్థిక వ్యవస్థ పరిణామాలను అంచనా వేసింది. ఆసియాలో వలే యూరోపియన్ షేర్లలోనూ మంగళవారం దూకుడు కనిపించింది. అమెరికాలో ‘షట్‌డౌన్’కు తెరపడడంతో అక్కడి షేర్ మార్కెట్ బలం పుంజుకుంది.
భారతీయ స్టాక్ మార్కెట్‌లో మంగళవారం నాడు కూడా సూచీలు కొత్త రికార్డులతో ట్రేడింగ్‌కు శ్రీకారం చుట్టాయి. మార్కెట్ చరిత్రలోనే తొలిసారిగా జాతీయ స్టాక్ ఎక్స్చేంజి ‘నిఫ్టీ’ 11వేల మైలురాయిని దాటి దూసుకువెళ్లింది. బాంబే స్టాక్ ఎక్స్చేంజి ‘సెనె్సక్స్’ కూడా 36వేల బెంచ్ మార్క్‌దాటి ట్రేడ్ అయింది. సానుకూల అంతర్జాతీయ సంకేతాలు, రాబోయే కేంద్ర బడ్జెట్‌పై ఆశావహ అంచనాలు మార్కెట్ సెంటిమెంటును బలపరచడంతో సూచీలు జీవనకాల గరిష్ఠాలను సాధించడం మొదలైంది. నిఫ్టీ 117.50 పాయింట్లకు చేరుకుని 11,083 వద్ద కొనసాగింది. సెనె్సక్స్ 210 పాయింట్ల లాభంతో 36,008 వద్ద కొనసాగింది. ఇన్ఫోసిస్, వేదాంతా లిమిటెడ్, యాక్సిస్ బ్యాంకు, ఎస్‌బీఐ, టాటాస్టీల్ తదితర సంస్థల షేర్లు లాభాల్లో దూసుకువెళ్లాయి. అంబూజా సిమెంట్, ఐషర్ మోటార్, విప్రో, జీల్, హింద్ పెట్రో షేర్లు నష్టపోయాయి.