బిజినెస్

భారత్‌లో 10 శాతం వృద్ధిరేటు సాధ్యమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, జనవరి 23: కార్మిక చట్టాలు, భూసేకరణ వంటి రంగాల్లో సంస్కరణలు చేపడితే, పది శాతం వృద్ధిరేటును సాధించడం భారత్‌కు అసాధ్యమేమీ కాదని నీతి ఆయోగ్ మాజీ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగరియా అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మొదటి మూడేళ్ల పాలనలో ఆర్థిక వృద్ధిరేటు 7.5 శాతానికి చేరుకుందని ఆయన గుర్తుచేశారు. న్యూయార్క్‌లోని కొలంబియా విశ్వవిద్యాలయంలో జరిగిన ఓ సదస్సులో ఆయన మాట్లాడుతూ, కార్మిక చట్టాలు, భూసేకరణ అంశాల్లో సంస్కరణలు తీసుకురావాల్సి ఉందన్నారు. మోదీ ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు, వస్తుసేవా పన్ను (జీఎస్టీ) అనే రెండు ప్రధాన సంస్కరణల కారణంగా వృద్ధిరేటు స్వల్పంగా క్షీణించిందని ఆయన తెలిపారు. ‘2022 నాటికి నవీన భారత్’ అనే మోదీ ఆశయాల ప్రభావంతో కొలంబియా విశ్వవిద్యాలయంలో ప్రముఖుల ప్రసంగాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో పనగరియా భారత ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులను వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి భారత్ 6.5 శాతం వృద్ధి రేటును సాధించే అవకాశం ఉందన్నారు. 8 శాతం వృద్ధిరేటును సైతం భారత్ సాధిస్తుందనడంలో ఎలాంటి అనుమానం లేదని, ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందన్న విషయంలోనూ సందేహం లేదన్నారు. భారత్ రెండంకెల వృద్ధి రేటును సాధించాలంటే కొన్ని కీలక రంగాల్లో సంస్కరణలు అవసరమని ఆయన విశే్లషించారు. కాగా, చైనా వృద్ధి రేటు 5 శాతానికి పతనమవుతుందని ఆయన అంచనా వేశారు.
కొద్దిరోజుల్లో మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న వార్షిక బడ్జెట్ గురించి సమావేశంలో కొందరు ప్రశ్నించగా, గత ఏడాది బడ్జెట్‌తో పోల్చిచూస్తే 2018-19 బడ్జెట్‌లో అనేక మార్పులు ఉంటాయని పనగరియా అన్నారు. కొద్దిరోజుల్లో సంస్కరణల ఆధారిత బడ్జెట్ రాబోతోందని ఆయన జోస్యం చెప్పారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వంటి కీలక సంస్కరణల తర్వాత ప్రవేశ పెడుతున్న బడ్జెట్‌పై అన్ని వర్గాల వారూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని అన్నారు. సంస్కరణలను సూచించేలా బడ్జెట్ ఉండవచ్చని, వ్యవసాయ రంగంపై బడ్జెట్‌లో తగినంతగా దృష్టి సారించాలని అన్నారు. భారత్‌లో నిరుద్యోగం మరీ అంత ఎక్కువగా లేదని, ఉపాధి అవకాశాలను కల్పించాల్సి ఉందన్నారు. ఉద్యోగాలు ఇచ్చేవారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని, ఇది దీర్ఘకాలంగా ఉన్న డిమాండ్ అన్నారు. నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడిగా మూడేళ్లపాటు తాను సంతృప్తికరంగా విధులు నిర్వహించానని పనగరియా తెలిపారు. బడా పారిశ్రామికవేత్తల నుంచే సమస్యలు ఎదురవుతున్నాయని, అయినా ప్రభుత్వం వారి జోలికి వెళ్లడం లేదని, భారత్‌లో అవినీతిపై ప్రధాని మోదీ పోరాటం చేస్తున్నారని అన్నారు.