బిజినెస్

డాక్టర్ రెడ్డీస్ ఎఎన్‌డిఎ కొనుగోళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 11: దేశీయ ప్రముఖ ఔషధరంగ సంస్థ, హైదరాబాద్ ఆధారిత డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్.. అమెరికాలో ఎనిమిది అబ్రివియేటెడ్ న్యూ డ్రగ్ అప్లికేషన్ల (ఎఎన్‌డిఎ)ను కొనుగోలు చేస్తోంది. నగదు రూపంలో జరిగే ఈ లావాదేవీ కోసం దాదాపు 2,300 కోట్ల రూపాయల (350 మిలియన్ డాలర్లు)ను వెచ్చిస్తోంది. ఈ మేరకు డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ శనివారం ఓ ప్రకటనలో తెలియజేసింది. కాగా, ఈ కొనుగోలుతో తమ ప్రోడక్ట్ పోర్ట్ఫోలియో మరింత బలపడుతుందని, అమెరికా మార్కెట్ వాటాను పెంచుకోగలమని సంస్థ సిఇఒ, కో-చైర్మన్ జివి ప్రసాద్ ఆశాభావం వ్యక్తం చేశారు.