బిజినెస్

అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సుకు అరకు కాఫీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 10: ప్రపంచ దేశాల ప్రతినిధులకు అరకు కాఫీ రుచి చూపించేందుకు గిరిజన సహకార సంస్థ(జీసీసీ) సిద్ధపడుతోంది. ఈ నెల 24 నుంచి మూడు రోజులపాటు విశాఖలోని ఏపీఐఐసీ గ్రౌండ్స్‌లో జరిగే అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సులో జీసీసీ అరకు కాఫీ ప్రత్యేక స్టాల్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 40 దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటున్నందున వీరందరికీ మూడు రోజులపాటు అరకు కాఫీ, వారం రోజుల కింద జాతీయ మార్కెట్‌లోకి విడుదల చేసిన ఇన్‌స్టెంట్ కాఫీని ఈ స్టాళ్ళ ద్వారా అందుబాటులో ఉంచనుంది. అరకుకాఫీ, ఇన్‌స్టెంట్ కాఫీ స్టాళ్ళను వేర్వేరుగా ఏర్పాటు చేసి వీటి ద్వారా దేశ, విదేశీ ప్రతినిధులకు రుచి చూపించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ సదస్సును వేదికగా చేసుకొని అరకు కాఫీ, ఇన్‌స్టెంట్ కాఫీ రుచిని చూపించడంద్వారా జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లోకి దీనిని తీసుకువెళ్ళాలని సంస్థ యాజమాన్యం ఆలోచన. 2016 నుంచి ఏడాదిన్నరకు పైగా ముఖ్యమైన అంతర్జాతీయ సదస్సులు విశాఖలో 15కి పైగానే నిర్వహించారు.
ఇండియన్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్‌ఆర్)తోపాటు గత ఏడాది ముఖ్యమైన బ్రిక్స్ సదస్సు, సీ ఫుడ్ సమిట్, మరికొన్ని అంతర్జాతీయ సదస్సులు, మహానాడు, అగ్రిటెక్ వంటి కార్యక్రమాలు రెండు, మూడు రోజులపాటు జరిగాయి. ఈ విధంగా జరిగిన కార్యక్రమాలను వేదికగా చేసుకున్న జీసీసీ అరకుకాఫీ ప్రత్యేక స్టాల్‌ను ఏర్పాటు చేయడం ద్వారా ఒక్కో కార్యక్రమంలో 10వేల నుంచి 15వేల వరకు కాఫీ కప్పులు విక్రయించినట్టు సంబంధితాధికారి ఒకరు తెలిపారు. ఒక్కో కప్పు కాఫీని రూ.20లకు విక్రయించడంతో రుచికరమైన దీనిని తాగేందుకు ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేకసార్లు విదేశీ ప్రతినిధులు ఆసక్తి చూపడం ప్రత్యేకమైంది. ఇదే తరహాలో 24నుంచి జరిగే అంతర్జాతీయ సదస్సులో స్థానం సంపాదించేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు పొందినట్టు తెలిసింది.