బిజినెస్

తెలంగాణ పర్యాటకంపై మహిళల సాహసయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 10: తెలంగాణ రాష్ట్ర పర్యాటక రంగం విశిష్టతను ప్రపంచానికి తెలియజేసేందుకు నలుగురు మహిళలు నడుం బిగించారు. వారి సాహసయాత్రకు ప్రభుత్వ ప్రోత్సాహంకూడా తోడైంది. ఆదివారం ఉదయం 7 గంటలకు పర్యాటక భవనం నుంచి ఈ యాత్రను ప్రారంభిస్తున్నట్టు మంత్రి చందూలాల్ తెలిపారు. 17 వేల కి.మీ.కు పైగా సాగే ఈ యాత్రకు జైభారతి నాయకత్వం వహిస్తుండగా, ప్రియ, శాంతి, శిల్ప భాగస్వామ్యం అవుతున్నారు. 50 రోజులపాటు సాగే మనదేశంతోపాటు బంగ్లాదేశ్, మయన్మార్, థాయ్‌లాండ్, లావోస్, కంబోడియా, వియత్నాం దేశాలను చుట్టివస్తారని మంత్రి తెలిపారు. వీరి యాత్ర పొడువునా తెలంగాణ రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలు, అక్కడి విశిష్టతలను స్థానికులకు వివరిస్తూ ముందుకు సాగిపోతారని తెలిపారు. వీరు పర్యటించే రాష్ట్రాలు, దేశాల అధికారులతో సంప్రదించి అవసరమైన సౌకర్యాలను కల్పించే విధంగా రాష్ట్ర పర్యాటక శాఖ చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. తెలంగాణ పర్యాటక రంగానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చేందుకు మహిళలు సిద్ధపడటం అభినందనీయమన్నారు.