బిజినెస్

మాజీ దౌత్యవేత్త వినోద్‌కుమార్‌కు మనీలా సదస్సుకు ఆహ్వానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 10: ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో వలసల గురించి ఐక్యరాజ్య సమితి రూపొందించిన ముసాయిదాపై ఈనెల 11, 12వ తేదీల్లో ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో జరుగుతున్న అంతర్జాతీయ సదస్సుకు మాజీ దౌత్యవేత్త డా. వినోద్‌కుమార్ వెళ్లారు. మైగ్రంట్ ఫోరమ్ ఇన్ ఏషియా సంస్థ నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మకమైన ఈ సదస్సుకు తెలంగాణ ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరమ్ (ప్రవాసి సంక్షేమ వేదిక)కు ఆహ్వానం అందింది. నల్లగొండ జిల్లాకు చెందిన వినోద్ కుమార్ వృత్తిరీత్యా వైద్యులు. 1986లో ఇండియన్ ఫారిన్ సర్వీస్‌లో చేరిన ఆయన భారత విదేశాంగ శాలో వివిధ హోదాల్లో పనిచేసి 2015లో రిటైర్ అయ్యారు. 1995-96లో హైదాబాద్ పాస్‌పోర్ట్ అధికారిగా, 2010-12లో ఢిల్లీలోని విదేశాంగ శాఖలో సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు. జర్మనీ, అల్జీరియా, మలేషియా, ఉజ్బెకిస్తాన్, అజర్‌బైజాన్ దేశాల్లో భారత రాయభారిగా వివిధ హోదాల్లో పనిచేశారు. ప్రస్తుతం ఆయన తెలంగాణ కాంగ్రెస్ కమి టీ ప్రవాస భారతీయుల విభాగం అధ్యక్షులుగా కూడా సేవలు అందిస్తున్నారు.