బిజినెస్

రైతుల జీవితాలు మెరుగుపడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సోనేపట్, ఫిబ్రవరి 10: దేశంలో వ్యవసాయోత్పత్తులు, ఆయా ఉత్పత్తుల వినియోగం విషయంలో నెలకొన్న అంతరం ఇంకా అలాగే ఉండిపోయిందని రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ అభిప్రాయపడ్డారు. దీనివల్ల రైతుల జీవితాలు మెరుగుపడటం లేదని, ఈ విషయంలో వారికి న్యాయం జరగాల్సి ఉందని ఆయన అన్నారు. హర్యానాలోని సోనేపట్‌లో శనివారం జరిగిన జాతీయ ఆహార సాంకేతిక వ్యాపార, నిర్వహణ సంస్థ (ఎన్‌ఐఎఫ్‌టీఈఎమ్) తొలి స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడారు.
సేవలరంగంలో మానవ నైపుణ్యానికి, వ్యయపొదుపునకు ఉన్న అవకాశాలు వ్యవసాయ రంగంలో లేకపోవడంపట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ ఆహార వ్యాపారరంగంలో కనిపిస్తున్న సానుకూల అంశాలు, ప్రయోజనాలు దేశంలో వ్యవసాయదారులకు అందేలా చూడాలని ఆయన సూచించారు. ధరలు, సాంకేతిక పరిజ్ఞానం, న్యాయం విషయంలో మిగతా రంగాలతో పోలిస్తే రైతులు చాలా దూరంగా ఉండిపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతి విపత్తులు, వాతావరణ సమస్యలనుంచి వారిని విముక్తులను చేసేలా సమాజం చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు. ఆహారచక్రాన్ని సరిగ్గా అమలు చేయ డం, శాస్తస్రాంకేతిక పరిజ్ఞానాన్ని సరి గ్గా వినియోగించడం ద్వారా రైతుల జీవితాల్లో మార్పు సాధ్యమవుతుందని ఆయన సూచించారు. ఇలాంటి సంస్థల్లో విద్యనభ్యసించినవారు రైతుల పరిస్థితుల్లో మార్పులు తీసుకురావడంలో కీలకపాత్ర పోషిస్తారని ఆయన అన్నారు. ప్రపంచంలో భారత ఆహార, కిరాణా మార్కెట్ ఆరోస్థానంలో ఉందని, 2025 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల మొత్తానికి ఇది చేరుకుంటుందని ఆయన తెలిపారు. మనదేశం చేస్తున్న ఎగుమతుల్లో 11 శాతం ఆహార రంగానికి చెందినవేనని, అందువల్లే ఈ రంగాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు దేశం లో 42 మెగా ఫుడ్ పార్కులను మం జూరు చేసిందని ఆయన అన్నారు.

చిత్రం..హర్యానాలోని ఎన్‌ఐఎఫ్‌టీఈఎమ్ తొలి స్నాతకోత్సవంలో ఓ విద్యార్థికి పట్టాను అందజేస్తున్న రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్