బిజినెస్

రెండో వారమూ పతనమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 10: ప్రధానంగా ప్రపంచ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి ప్రతికూల ప్రభావం ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్‌పై పడింది. దీంతో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ వరుసగా రెండో వారం పతనమయ్యాయి. అమెరికాలో వడ్డీ రేట్లు పెరగడానికి అవకాశాలు ఉన్నాయనే వార్తలు భారత స్టాక్ మార్కెట్‌లో మదుపరులను ఆందోళనకు గురి చేశాయి. అక్కడ వడ్డీ రేట్లు పెరిగితే, అక్కడి నుంచి భారత స్టాక్ మార్కెట్లలోకి వచ్చే నిధుల ప్రవాహంపై ప్రతికూల ప్రభావం పడుతుందని మదుపరులు భావించారు. దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతుందనే అంచనాలు కూడా శుక్రవారంతో ముగిసిన ఈ వారంలో స్టాక్ మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. విదేశీ మదుపరులు ఈ వారం భారత మార్కెట్లలో నికర విక్రయదారులుగా నిలిచారు. వారు ఈ వారంలో నికరంగా రూ. 7,380.26 కోట్ల విలువయిన షేర్లను విక్రయించారు. ప్రపంచ మార్కెట్లలో ఒడిదుడుకుల కారణంగా వారు అప్రమత్తంగా వ్యవహరించారు.
అమ్మకాల ఒత్తిడిలో ప్రపంచ మార్కెట్లు పడిపోవడంతో వాటి ప్రతికూల ప్రభావంతోనే ఈ వారం భారత స్టాక్ మార్కెట్లు ప్రారంభం అయ్యా యి. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్‌సభలో ప్రవేశపెట్టిన 2018-19 బడ్జెట్‌లో ఈక్విటీలపై ఆర్జించే లాభాలపై పది శాతం దీర్ఘకాలిక మూలధన లాభాల (ఎల్‌టీసీజీ) పన్నును విధించడంతో అప్పటికే పడిపోయిన భారత స్టాక్ మార్కెట్లను ప్రపంచ మార్కెట్ల ప్రతికూల ప్రభావం మరింత దెబ్బతీసింది. ఎక్కువ మంది అంచనా వేసినట్లుగానే రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) తన ద్రవ్య విధాన సమీక్షలో కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచాలని బుధవారం నిర్ణయించడంతో పాటు, ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ అంచనా వృద్ధి రేటును 6.6 శాతానికి తగ్గించడం వల్ల మదుపరులలో ద్రవ్యలోటు పెరుగుతుందనే ఆందోళన మొదలయింది. ఆర్‌బీఐ నిర్ణయం వెలువడిన తరువాత ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగాల షేర్ల ధరలు బాగా పడిపోయాయి. దీంతో మార్కెట్ నష్టాల్లో పడిపోయింది. అయితే, అప్పటికే ధరలు బాగా పడిపోయిన షేర్లను కొనుగోలు చేయడానికి మదుపరులు పూనుకోవడంతో గురువారం కీలక సూచీలు పుంజుకున్నాయి. మొత్తం మీద శుక్రవారంతో ముగిసిన ఈ వారంలో సెనె్సక్స్ 1,060.99 పాయింట్లు (3.03 శాతం) పడిపోయి, 34,005.76 పాయింట్ల వద్ద ముగిసింది. జనవరి నాలుగో తేదీ తరువాత సెనె్సక్స్ ఇంత దిగువ స్థాయిలో ముగియడం ఇదే మొదటిసారి. నిఫ్టీ కూడా ఈ వారంలో 305.65 పాయింట్లు (2.84 శాతం) దిగజారి, 10,454.95 పాయింట్ల వద్ద స్థిరపడింది. జనవరి మూడో తేదీ తరువాత నిఫ్టీ ఇంత దిగువ స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి. గత రెండు వారాలలో సెనె్సక్స్ 2,044.68 పాయింట్లు (5.76 శాతం), నిఫ్టీ 614.70 పాయింట్లు (5.63 శాతం) పడిపోయాయి.
ఈ వారంలో అన్ని రంగాల సూచీలు దిగజారాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్, ఐటీ, టెక్నాలజి, ఎఫ్‌ఎంసీజీ, చమురు- సహజ వాయువు, ఆటో, కన్స్యూమర్ డ్యూరేబుల్స్, పీఎస్‌యూ రంగాల సూచీలు బాగా దెబ్బతిన్నాయి. అయితే, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లు ఈ వారంలో మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడిని తట్టుకొని నిలవడమే కాకుండా, లాభపడ్డాయి.