బిజినెస్

సిద్ధమవుతున్న నిబంధనావళి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 12: అనుబంధ బ్యాంకుల విలీనం ప్రక్రియకు నాంది పలికింది 210 సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ). ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టమైన ఆదేశాలు రానప్పటికీ, ఈ వ్యవహారంపై రాజకీయంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ ఐదు అనుబంధ బ్యాంకులను తనలో కలిపేసుకునేందుకు ఓ నిబంధనావళిని సిద్ధం చేస్తోంది. ఇందుకోసం 15-20 మంది సభ్యులతో కూడిన ఓ బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఈ బృందం విలీనానికి కావాల్సిన నిబంధనావళి కోసం పనిచేస్తోందని, ఓ జనరల్ మేనేజర్ ఇందుకు నాయకత్వం వహిస్తారని, బృందంలో కొందరు డిప్యూటి జనరల్ మేనేజర్లూ ఉంటారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. మేనేజింగ్ డైరెక్టర్ విజి కన్నన్ నాయకత్వంలో ఈ బృందం నడుస్తుందన్నాయి. అంతా సజావుగా సాగితే 3-4 నెలల్లో విలీన ప్రక్రియ మొదలవుతుందని సదరు సన్నిహిత వర్గాలు చెప్పాయి. నిజానికి గత నెలలోనే ఐదు అనుబంధ బ్యాంకుల విలీనానికి సంబంధించిన ప్రతిపాదనను ప్రభుత్వానికి ఎస్‌బిఐ బోర్డు సమర్పించింది. కాగా, మహిళల కోసం ప్రత్యేకంగా తొలిసారి ఏర్పాటుచేసిన భారతీయ మహిళా బ్యాంక్‌ను కూడా ఎస్‌బిఐలో విలీనం చేయాలని భావిస్తున్నది తెలిసిందే. దీంతో ప్రభుత్వానికి అందించిన ప్రతిపాదనలో మహిళా బ్యాంక్ అంశం కూడా ఉంది. ఎస్‌బిఐకి అనుబంధంగా పనిచేస్తున్న బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్‌బిహెచ్)తోపాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్, జైపూర్ (ఎస్‌బిబిజె), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావన్‌కోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ ఉన్నాయి.
ఈ ఐదు అనుబంధ బ్యాంకులతోపాటు భారతీయ మహిళా బ్యాంకు విలీనానికి సంబంధించి ఎస్‌బిఐ సమర్పించిన ప్రతిపాదనపై ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పందిస్తూ ‘ప్రస్తుతం ఎస్‌బిఐ ప్రతిపాదన మా పరిశీలనలో ఉంది. దీనిపై త్వరలోనే స్పందిస్తాం. బ్యాంకుల ఏకీకృతానికి మా ప్రభుత్వం మద్దతిస్తుంది. ఈ విషయాన్ని ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) కోసం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లోనూ స్పష్టం చేశాం.’ అన్నారు.
ప్రభుత్వరంగ బ్యాంకుల పనితీరుపై బ్యాం కుల అధిపతులతో గత వారం నిర్వహించిన సమీక్ష అనంతరం విలేఖరులతో జైట్లీ మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు. ఎస్‌బిఐ ప్రతిపాదనకు ఎప్పుడు ఆమోదం ఇస్తారన్న ప్రశ్నకు బదులుగా ‘త్వరలోనే’ అని ఆయన అన్నారు. ఇకపోతే ఎస్‌బిఐ ఆలోచనను అనుబంధ బ్యాంకుల ఉద్యోగ సంఘాలు తీవ్రంగా తప్పుబడుతున్నది తెలిసిందే. గత నెల 20 దేశవ్యాప్తంగా ఒకరోజు సమ్మె కూడా చేశాయి. ఈ ప్రతిపాదిత విలీనంపై ఈ నెల 28న, వచ్చే నెల 28, 29న నిరసన తెలియజేస్తామని ప్రకటించాయి కూడా.
అసెంబ్లీలో తీర్మానం చేయాలి
ఎస్‌బిఐ ప్రతిపాదించిన అనుబంధ బ్యాంకుల విలీనానికి వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీలో తప్పక తీర్మానం చేయాలని సిపిఐ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బ్యాంక్ ఉద్యోగుల సమాఖ్య (ఎపిటిబిఇఎఫ్) గౌరవాధ్యక్షుడు సురవరం సుధాకర్ రెడ్డి ఆదివారం పిటిఐతో మాట్లాడుతూ డిమాండ్ చేశారు.
ఎస్‌బిఐలో ఎస్‌బిహెచ్ విలీనమైతే రాష్ట్ర ఆదాయానికి గండి పడుతుందని, నిజానికి ఎస్‌బిహెచ్‌ను హైదరాబాద్ నిజాం స్థాపించారని గుర్తుచేశారు. అంతేగాక ఈ బ్యాంక్ లాభాల్లో ఉందన్నారు. కాబట్టి ఎస్‌బిహెచ్‌ను ఎందుకు విలీనం చేయాలన్నదానిపై కచ్ఛితమైన కారణం లేదని పేర్కొన్న ఆయన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో ఈ బ్యాంక్‌ను ప్రజలంతా ‘తెలంగాణ బ్యాంక్’గా మార్చాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. సిపిఐ (ఎమ్) నేతృత్వంలో కేరళలో అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావన్‌కోర్ విలీనాన్ని వ్యతిరేకిస్తోంది. కేరళ ప్రజలు దీన్ని రాష్ట్ర బ్యాంకుగా భావిస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం కూడా అదే దృష్టితో చూడాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ విలేఖరులతో అన్నారు.
ఇదిలావుంటే ఎస్‌బిఐకి దేశవ్యాప్తంగా సుమారు 16,500ల శాఖలుండగా, అనుబంధ బ్యాంకుల విలీనం జరిగితే అవి 22,500 శాఖలకు చేరనున్నాయి. అలాగే ఎటిఎమ్‌ల సంఖ్య 58,000లకు, ఆస్తుల విలువ 37 లక్షల కోట్ల రూపాయలకు చేరుతుంది. అనుబంధ బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్, జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావన్‌కోర్ స్టాక్ మార్కెట్లలో లిస్టయ ఉన్నాయి. కాగా, ప్రస్తుతం దేశంలో మొత్తం 27 ప్రభుత్వరంగ బ్యాంకులు ఉన్నాయి. మరోవైపు ప్రభుత్వరంగ బ్యాంకింగ్ వ్యవస్థను కలవరపెడుతున్న మొండి బకాయిలు కూడా బ్యాంకుల ఏకీకృతానికి దారి తీస్తోందని నిపుణులు చెబుతున్నారు. గత ఆర్థిక సంవత్సరం (2015-16) చివరి త్రైమాసికం, ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో 12 బ్యాంకులు 22 వేల కోట్ల రూపాయలకుపైగా నష్టాలను నమోదు చేయగా, వీటికి కారణం మొండి బకాయిలే. దీంతో బ్యాంకులు ఒక్కటైతే మొండి బకాయిల సమస్య తీరుతుందని ప్రభుత్వం వాదిస్తోంది. ఒక బ్యాంకులో రుణం తీసుకుని ఎగ్గొట్టి, మరో బ్యాంకులో రుణం తీసుకుంటున్నారని, బ్యాంకులు తగ్గితే ఈ అవకాశం ఉండదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది సర్కారు. మొత్తానికి ఎస్‌బిఐ అనుబంధ బ్యాంకుల విలీనం ఏ మలుపు తిరుగుతుందో వేచిచూడాల్సిందే. 2008లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర, 2010లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్.. ఎస్‌బిఐలో విలీనం అయ్యాయ.