బిజినెస్

ఆర్థిక వ్యవస్థ భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఆర్థిక పరిస్థితి చక్కబడుతుందని, అందువల్ల ద్రవ్యలోటు ఇంకా పెరిగే అవకాశం ఉండబోదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శనివారం విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రపంచ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరుగుతుండటంపై తక్షణమే ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదని ఆయన అన్నారు. ఊహాగానాలపై ఆధారపడి అంచనాలకు రావొద్దని, వాస్తవ పరిస్థితి ఈ అంచనాలకు భిన్నంగా ఉందని, ప్రపంచ మార్కెట్‌లో గత మూడు రోజులుగా చమురు ధరలు పడిపోతున్నాయని జైట్లీ పేర్కొన్నారు. బడ్జెట్ అనంతర కసరత్తులో భాగంగా జరిగిన రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) బోర్డు సమావేశానంతరం మంత్రి విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ అధ్యక్షతన ఇటీవల సమావేశమైన ద్రవ్య విధాన కమిటీ కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచాలని తీసుకున్న నిర్ణయం సమతుల్యమయినదని అన్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వ్యవస్థ మరింత పుంజుకుంటుందని పేర్కొన్నారు.

చిత్రం..సమావేశంలో పాల్గొన్న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ