బిజినెస్

పోలవరం పనులు 53 శాతం పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 12: జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటివరకూ 12,910 కోట్ల రూపాయలు ఖర్చుచేసి 53శాతం పనులను పూర్తిచేశామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వెల్లడించారు. సోమవారం వెలగపూడి సచివాలయంలోని పబ్లిసిటీ సెల్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంధించిన ప్రశ్నలకు పరోక్షంగా మంత్రి బదులిచ్చారు. పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి ఇప్పటివరకూ 51సార్లు వర్చువల్ ఇన్‌స్పెక్షన్ల ద్వారా సమీక్షించారన్నారు. సోమవారాన్ని పోలవారంగా మార్చి సమీక్షిస్తూ, నెలకు ఒకసారి ప్రాజెక్టు సైట్‌ను సందర్శిస్తున్నారని తెలిపారు. ఇప్పటివరకూ 53 శాతం పనులు పూర్తి చేశామన్నారు. కుడి ప్రధాన కాలువకు సంబంధించి 91 శాతం, ఎడమ కాలువకు సంబంధించి 60 శాతం పనులు, హెడ్ వర్క్స్‌కు సంబంధించి 39 శాతం పనులు, డ్యాం, స్పిల్‌వేకు సంబంధించి 71 శాతం పనులు పూర్తయ్యాయని వచ్చే 2019 డిసెంబర్ నాటికి ఈ ప్రాజెక్టును పూర్తిచేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. డిసెంబర్ నాటికి 48 గేట్లను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఈ ప్రాజెక్టుపై తమ ప్రభుత్వం వచ్చాక 7079 కోట్ల రూపాయలు ఖర్చు చేయగా 2014కు ముందున్న ప్రభుత్వాలు 5,135 కోట్లు ఖర్చు చేశాయని తెలిపారు. అలాగే ఇప్పటివరకూ కేంద్ర ప్రభుత్వం 4,932 కోట్ల రూపాయలను విడుదల చేయగా, మరో 2,247 కోట్ల రూపాయలను విడుదల చేయాల్సి ఉందని మంత్రి వివరించారు. వచ్చే సోమవారం పోలవరం ప్రాజెక్టు పనులను ముఖ్యమంత్రి తనిఖీ చేయనున్నారని వెల్లడించారు. సోమవారంలోగా మిగిలిన పనులకు సంబంధించిన పూర్తి వివరాల నివేదికను సమర్పించాలని సీఎం ఆదేశించారని చెప్పారు. గత ప్రభుత్వాలు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కాలువ నిర్మాణాలకు మాత్రమే పరిమితం కాగా ఈ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టును పూర్తిచేసేందుకు అన్ని పనులను వేగవంతంగా నిర్వహించడం జరుగుతోందన్నారు. పోలవరం ప్రాజెక్టుపై ఎవరు ఎన్ని ఆటంకాలు సృష్టించినా వాటన్నిటినీ అధిగమించి పనులు సకాలంలో పూర్తిచేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని వివరాలను ప్రత్యేక వెబ్ సైట్‌లో పొందుపరిచామని తెలిపారు. తమ ప్రభుత్వం ప్రాధాన్యతగా పెట్టుకున్న 28 ప్రాజెక్టుల్లో ఇప్పటికే ఆరు ప్రాజెక్టులు పూర్తిచేయగా మరో 12 ప్రాజెక్టులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని మంత్రి వెల్లడించారు. 116 రోజుల పాటు సాగే జలసంరక్షణ కార్యక్రమంలో పూర్తిచేసిన ప్రాజెక్టులను ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రంలో జల సంరక్షణ పనులకు ఇప్పటివరకూ 10,867 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని తద్వారా భూగర్భ జలమట్టం పెద్దఎత్తున పెంపొందించుకోగలిగామని పేర్కొన్నారు. ్ర తక్కువ భూగర్భ జలమట్టం గల మండలాలు 52 మూడు నుండి 8 మీటర్లు గలవి 207 మండలాలు, 8 మీటర్ల కంటే ఎక్కువ మట్టం గలవి 411 మండలాలున్నాయని వివరించారు. రాష్ట్రంలోని ఇతర సాగునీటి ప్రాజెక్టుల గురించి మంత్రి దేవినేని మాట్లాడుతూ వంశధార-నాగావళి అనుసంధానం రెండు పంటలకు నీరందించడం జరుగుతుందని చెప్పారు. విశాఖ జిల్లాలో 2లక్షల ఎకరాలకు నీరందించనున్నామని, పురుషోత్తపట్నం ఎత్తిపోతల మార్చి నాటికి పూర్తి చేయనున్నామన్నారు.