బిజినెస్

బలపడిన స్టాక్ మార్కెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 12: ప్రపంచ మార్కెట్లలో సానుకూల ధోరణి నెలకొనడంతో పాటు ఇటీవల ధరలు పడిపోయిన విలువయిన షేర్లను మదుపరులు కొనుగోలు చేయడంతో దేశీయ స్టాక్ మార్కెట్ కీలక సూచీలు సోమవారం బాగా పుంజుకున్నాయి. వరుసగా రెండు వారాల పాటు పడిపోయిన దేశీయ స్టాక్ మార్కెట్ కీలక సూచీలు గత పది సెషన్లలో పుంజుకోవడం ఇది రెండోసారి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ సోమవారం 295 పాయింట్లు పుంజుకోగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ 85 పాయింట్లు పెరిగింది. ద్రవ్యోల్బణం గణాంకాలు సోమవారం మార్కెట్ పనివేళలు ముగిసిన తరువాత వెలువడ్డాయి. అయితే, మూడో త్రైమాసికంలో కార్పొరేట్ కంపెనీల లాభాలు బాగుండటంతో పాటు రిటెయిల్ ద్రవ్యోల్బణం తగ్గుతుందన్న అంచనాలతో దేశీయ స్టాక్ మార్కెట్‌లో సెంటిమెంట్ తిరిగి బలపడింది. మదుపరులు సోమవారం.. ఇటీవల ధరలు పడిపోయిన పవర్, స్థిరాస్తి, క్యాపిటల్ గూడ్స్, బ్యాంకింగ్ షేర్లను భారీగా కొనుగోలు చేశారు. దేశీయ ఫండ్‌లు, రిటెయిల్ ఇనె్వస్టర్లు ఎడతెరిపి లేకుండా కొనుగోళ్లు జరపడంతో సదరు రంగాల షేర్ల ధరలు బాగా పుంజుకున్నాయి. సెనె్సక్స్ ప్యాక్‌లోని సంస్థల్లో టాటా స్టీల్ షేర్ల విలువ అత్యధికంగా 4.22 శాతం పెరిగింది. మూడో త్రైమాసికంలో టాటా స్టీల్ నికర లాభాలు అయిదు రెట్లు పెరగడంతో ఆ కంపనీ షేర్లను కొనుగోలు చేయడానికి మదుపరులు ఎగబడ్డారు. ఇటీవల అమ్మకాల ఒత్తిడికి గురయిన ఆరోగ్య సంరక్షణ రంగానికి చెందిన షేర్ల ధరలు కూడా పుంజుకున్నాయి. అయితే, మూడో త్రైమాసికంలో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ నష్టాలను నమోదు చేసిన ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ షేర్ల ధర 2.67 శాతం దిగజారింది. అమెరికా స్టాక్ మార్కెట్ శుక్రవారం లాభపడంతో దాని ప్రభావం వల్ల ఆసియా, ఐరోపా స్టాక్ మార్కెట్ల సూచీలు బలపడటం కూడా సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్‌లో మదుపరుల సెంటిమెంట్ పుంజుకోవడానికి దోహదపడింది. రూపాయి కోలుకుంటుండటం కూడా మదుపరుల సెంటిమెంట్ బలపడటానికి తోడ్పడింది. సోమవారం ఉదయం పటిష్ఠమయిన 34,351.34 పాయింట్ల వద్ద ప్రారంభమయిన సెనె్సక్స్ దేశీయ ఫండ్‌లు, రిటెయిల్ ఇనె్వస్టర్లు ఎడతెరిపి లేకుండా కొనుగోళ్లు జరపడంతో తాజా గరిష్ఠ స్థాయి 34,351.34 పాయింట్లను తాకింది. అయితే తరువాత మదుపరులు లాభాల స్వీకరణకు పూనుకోవడం వల్ల ఈ సూచీ 34,115.12 పాయింట్లకు దిగజారింది. తరువాత మళ్లీ పుంజుకొని చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 294.71 పాయింట్ల (0.87 శాతం) లాభంతో 34,300.47 పాయింట్ల వద్ద ముగిసింది.
ఈ సూచీ శుక్రవారం 407.40 పాయింట్లు (1.18 శాతం) దిగజారి 34,005.76 పాయింట్ల వద్ద ముగిసిన విషయం విదితమే. నిఫ్టీ సోమవారం ఇంట్రా-డేలో గరిష్ఠ స్థాయి 10,555.50 పాయింట్లను తాకినప్పటికీ, చివరకు కొంత తగ్గి 10,539.75 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఈ సూచీ క్రితం ముగింపుతో పోలిస్తే 84.80 పాయింట్లు (0.81 శాతం) పుంజుకుంది. ఇదిలా ఉండగా, శుక్రవారం దేశీయ సంస్థాగత మదుపరులు (డీఐఐలు) నికరంగా రూ. 588.42 కోట్ల విలువయిన షేర్లను కొనుగోలు చేయగా, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌ఐఐలు) రూ. 1,351.70 కోట్ల విలువయిన షేర్లను విక్రయించారు.
మూడో త్రైమాసికంలో రూ. 10.12 కోట్ల నికర లాభాన్ని ఆర్జించిన టాటా కమ్యూనికేషన్స్ షేర్ల ధర సోమవారం 1.71 శాతం పెరిగింది. ప్రపంచ అమ్మకాలలో 20 శాతం పెరుగుదల నమోదు చేసిన టాటా మోటార్స్ షేర్ల విలువ 0.88 శాతం పుంజుకుంది. లార్సెన్ అండ్ టర్బో షేర్ ధర 1.63 శాతం పుంజుకుంది. సోమవారం నాటి లావాదేవీల్లో లాభపడిన ఇతర సంస్థల్లో యెస్ బ్యాంక్, పవర్ గ్రిడ్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, హీరోమోటోకార్ప్, రిల్, హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్, మారుతి సుజుకి, ఓఎన్‌జీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, విప్రో, బజాజ్ ఆటో, ఆసియన్ పెయింట్, సన్ ఫార్మా ఉన్నాయి. వీటి షేర్ల విలువ 2.89 శాతం వరకు పెరిగింది.