బిజినెస్

పైలట్ ప్రాజెక్టుగా వర్క్ ఫ్రమ్ హోం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 15: ఫైబర్ గ్రిడ్‌ను ఉపయోగించి రాష్ట్రంలో కొన్ని గ్రామాల్లో వర్కు ఫ్రమ్ హోమ్ ప్రాజెక్టును చేపట్టేందుకు ఫస్ట్ అమెరికా (ఇండియా) ముందుకు వచ్చింది. వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేష్‌తో ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ రఘు, సీనియర్ మేనేజర్ శ్రీనివాస్ గురువారం భేటీ అయ్యారు. టైటిల్, బీమా, మార్ట్‌గేజ్ హోమ్ వారంట్ వంటి సేవలు ఈ కంపెనీ అందిస్తున్నది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ల్యాండ్ రికార్డులను డిజిటలైజ్ చేస్తున్నామని, ట్యాంపరింగ్ చేసే అవకాశం లేకుండా ల్యాండ్ రికార్డులన్నీ బ్లాక్ చైన్ టెక్నాలజీ వేదికపైకి తీసుకువస్తున్నామన్నారు. ఇంటర్నెట్ సదుపాయం ప్రజల ప్రాథమిక హక్కుగా మారబోతోందన్నారు. సర్ట్ఫికెట్ లెస్ గవర్నమెంట్ తీసుకువస్తున్నామని, ల్యాండ్ రికార్డులను డిజిటలైజ్ చేయడం ద్వారా 20 శాతం వృద్ధి సాధించే వీలు ఉందన్నారు.