బిజినెస్

శ్రీసిటీలో ఐఆర్‌ఎంఆర్‌ఎ టెస్టింగ్ ల్యాబ్ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తడ, ఫిబ్రవరి 15: కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ అనుబంధ సంస్థ అయిన ఇండియన్ రబ్బర్ మ్యాన్సుఫ్యాక్చరర్స్ రీసెర్స్ అసోయేషన్‌కు సంబంధించిన అధునాతన వస్తు, ఉత్పత్తుల టెస్టింగ్ ల్యాబ్‌ను గురువారం నెల్లూరు జిల్లా శివారును ఉన్న శ్రీసిటీ సెజ్‌లో ప్రారంభించారు. ఐఆర్‌ఎంఆర్‌ఎ ప్రెసిడెంట్, జిఆర్‌పి లిమిటెడ్ ఎండి రాజేంద్ర వి గాంధీ దీనిని లాంచనంగా ప్రారంభించారు.
ఐఆర్‌ఎంఆర్‌ఎ డైరక్టర్ రాజకుమార్, కౌన్సిల్ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ శ్రీసిటీలో అధునాతన సౌకర్యాలు,యాజమాన్యం సహకారం, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సులభతర వ్యాపార నిర్వహణ వంటి అంశాలు తమ శాఖను శ్రీసిటీలో ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణమని అన్నారు. దక్షిణ భారతదేశంలోని ఆటోమొబైల్ రంగంలోని టైరు, రబ్బర్ ఉత్పాదక రంగాల వారికి తమ ల్యాబ్ అనుకూలంగా ఉంటుందన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అని, ఈ ప్రాంతంలో ఆటోమొబైల్ హబ్‌గా మారునున్న నేపధ్యంలో ఆటో మోబైల్ పరిశ్రమ వర్గాలకు సంస్థ ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఈ ల్యాబ్ 25 కోట్ల రూపాయల పెట్టుబడితో యూనివర్శల్ టెస్టింగ్ మిషన్, మూవీ విస్కో మీటరు, డైరియో మీటర్, డిజటల్ హార్డ్‌నెస్ టెస్టర్ వంటి పలు అధునాతన పరికరాలను ఏర్పాటు చేశారని, త్వరలో ఫైర్ టెస్గింగ్ సౌకర్యం కూడా రానున్నదని,ప్రస్తుతం ఈ ల్యాబ్‌లో 20 మంది ఉద్యోగులుంటారని, త్వరలో 100 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. దేశంలోని ప్రఖ్యాతి గాంచిన ఆటో, టైర్ల తయారీ కంపెనీలు పలు పరిశోధనసంస్థలు ఈ సంస్థ సేవలు పొందుతున్నాయన్నారు.