బిజినెస్

బలపడిన దేశీయ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 15: ద్రవ్యోల్బణం తగ్గ డం వల్ల ఉత్సాహంతో ఉన్న మదుపరులు ఇటీవల ధరలు తగ్గిన విలువయిన షేర్లను కొనుగోలు చేయడంతో గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లు బలపడ్డాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 141 పాయింట్లు పుంజుకుంది. రూ. 11,400 కోట్ల భారీ కుంభకోణంలో చిక్కుకున్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) షేర్ల ధర 12 శాతం పతనమయింది. సెనె్సక్స్ 141.52 పాయింట్లు (0.41 శాతం) పుంజుకొని 34,297.47 పాయింట్ల వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ 44.60 పాయింట్లు (0.42 శాతం) పెరిగి, 10,545.50 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇంట్రా-డేలో నిఫ్టీ 10,618.10 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం జనవరి నెలలో ఆరు నెలల కనిష్ట స్థాయి 2.84 శాతానికి తగ్గడంతో పాటు కొన్ని బ్లూచిప్ కంపనీలు మూడో త్రైమాసికంలో ఆకర్షణీయమయిన లాభాలను ఆర్జించడంతో మదుపరులలో ఉత్సాహం నెలకొంది. ఇదిలా ఉండగా, బుధవారం ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు) నికరంగా రూ. 728.71 కోట్ల విలువయిన షేర్లను, దేశీయ సంస్థాగత మదుపరులు (డీఐఐలు) రూ. 152.39 కోట్ల విలువయిన షేర్లను విక్రయించారు. అమెరికాలో ద్రవ్యోల్బణం 2.1 శాతానికి పెరగడంతో పాటు కన్స్యూమర్ సేల్స్ డాటా బలహీనంగా ఉన్నప్పటికీ, గురువారం గ్లోబల్ మార్కెట్లలో సానుకూల ధోరణి నెలకొంది. గురువారం నాటి లావాదేవీల్లో సెనె్సక్స్ ప్యాక్‌లోని సంస్థల్లో ఐసీఐసీఐ బ్యాంక్ అత్యధికంగా లబ్ధి పొందింది. ఈ బ్యాంకు షేర్ ధర 3.15 శాతం పెరిగింది. ఇన్ఫోసిస్ 1.47 శాతం లాభపడింది. లాభపడిన ఇతర కంపనీలలో పవర్ గ్రిడ్, ఓఎన్‌జీసీ, బజాజ్ ఆటో, హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్, ఎస్‌బీఐ, హెచ్‌యూఎల్, ఎంఅండ్‌ఎం, ఐటీసీ, డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, టీసీఎస్, రిల్, మారుతి సుజుకి, ఎన్‌టీపీసీ ఉన్నాయి. వీటి షేర్ల విలువ 1.46 శాతం వరకు పెరిగింది. కాగా, నష్టపోయిన వాటిల్లో హీరో మోటోకార్ప్, టాటా స్టీల్, భారతి ఎయిర్‌టెల్, ఎల్‌అండ్‌టీ, విప్రో, కోటక్ మహింద్రా బ్యాంక్, ఆసియన్ పెయింట్స్ ఉన్నాయి.
ఇదిలా ఉండగా, మూడో త్రైమాసికంలో నికర లాభం 60 శాతం పెరిగిన నెస్ట్లే ఇండియా షేర్ ధర గురువారం 4.28 శాతం పెరిగింది. రంగాల వారీ సూచీలలో బీఎస్‌ఈ చమురు, సహజవాయువు సూచీ అత్యధికంగా 0.96 శాతం పెరిగింది. తరువాత స్థానాల్లో వరుసగా మెటల్, ఐటీ, బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసీజీ, టెక్నాలజి రంగాలు నిలిచాయి. టెలికం, కన్స్యూమర్ డ్యూరేబుల్స్, రియాల్టీ, క్యాపిటల్ గూడ్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, పవర్, హెల్త్‌కేర్, ఆటో సూచీలు పడిపోయాయి.