బిజినెస్

చురుగ్గా కేటీపీఎస్ 7వ దశ విస్తరణ పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాల్వంచ, ఫిబ్రవరి 16: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ కర్మాగారం రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ కాంతులను వెదజల్లుతూ తెలంగాణ రాష్ట్రానికే తలమానికంగా నిలుస్తోంది. పాల్వంచతో పాటు జిల్లా కీర్తి ప్రతిష్ఠలను దశదిశలా విస్తరింపజేసి దేశ పారిశ్రామిక అభివృద్ధిలో తనవంతు పాత్ర నిర్వహిస్తూ ప్రగతి పథంలో ముందుకు సాగుతోంది. మారుతున్న కాలంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ దృష్టిలో ఉంచుకుని కేటీపీఎస్ విస్తరణలో రాష్ట్రంలోనే కేటీపీఎస్ కర్మాగారం భారీ విద్యుత్ ఉత్పత్తి కర్మాగారంగా రూపుదిద్దుకుంటోంది. విద్యుత్ ఉత్పత్తిలో ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డులు సృష్టిస్తూ జాతీయ, రాష్ట్ర స్థాయిలో ప్రథమ, ద్వితీయ స్థానాలు దక్కించుకుంది. ప్రస్తుతం కర్మాగారంలో పాత ప్లాంట్, 5వ దశలోని మొత్తం 10 యూనిట్ల పరిధిలో 1220 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. 6వ దశ ప్రారంభం కావడంతో మరో 500 మెగావాట్ల ఉత్పత్తి పెరిగింది. దీంతో కేటీపీఎస్ ఉత్పత్తి 1720 మెగావాట్లకు చేరుకుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి సారించి తిరిగి ఇక్కడ 7వ దశ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సుమారు 5 వేల కోట్ల రూపాయల వ్యయంతో 800 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న 7వ దశ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈ ప్లాంట్ పూర్తయితే కర్మాగారంలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 1720 మెగావాట్ల నుంచి 2,520 మెగావాట్లకు చేరుతుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో కేటీపీఎస్ తెలంగాణ రాష్ట్రంలోనే భారీ థర్మల్ విద్యుత్ కేంద్రంగా అవతరించనుంది. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా పాల్వంచలో మూడున్నర దశాబ్దాల క్రితం కేటీపీఎస్‌ను నెలకొల్పారు.
విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు సమీపంలోని కొత్తగూడెం, మణుగూరు, ఇల్లందు, ప్రాంతాల నుండి సరఫరా అవుతోంది. అవసరం అయిన నీరు కినె్నరసాని రిజర్వాయర్ నుండి అందుతోంది. 1964లో కేటీపీఎస్ ఒక్కొక్కటి 60 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఎ స్టేషన్‌కు చెందిన 1,2,3,4 యూనిట్లు నెలకొల్పారు. 1974లో కేటీపీఎస్‌ను క్రమంగా విస్తరింపజేశారు. 1972-73 సంవత్సరాల్లో 120 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండు యూనిట్లు5,6 నెలకొల్పారు. 1973-74 సంవత్సరాల్లో ఒక్కొక్కటి 120 మెగావాట్ల సామర్థ్యం కలిటిన సి స్టేషన్ 7,8 యూనిట్లను నెలకొల్పారు. 1994లో 1424 కోట్ల వ్యయంతో ఒక్కోటి 250 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 9,10 యూనిట్లను నిర్మించారు. 5వ దశ రికార్డ్ కాలంలో నిర్మాణం పూర్తి చేసుకుని 500 మెగావాట్ల ఉత్పత్తి అందిస్తోంది. తిరిగి 10 సంవత్సరాల తర్వాత నాటి రాష్ట్ర వైద్య విధాన పరిషత్ శాఖ మంత్రి వనమా వెంకటేశ్వరరావు ఎన్నికల్లో చేసిన వాగ్దానాల్లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి రూ.2,500 కోట్లతో 500 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో కేటీపీఎస్ 6వ దశ 11వ యూనిట్ నిర్మించారు. 6వ దశ నిర్మాణం పూర్తి కావడంతో ఉత్పత్తి సామర్థ్యం 1220 మెగావాట్ల నుండి 1720 మెగావాట్లకు చేరుకుంది. ప్రస్తుతం 5 వేల కోట్లతో 800 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మితమవుతున్న 7వ దశ మరో నెల రోజుల్లో పూర్తి కానుంది. ఇది పూర్తయితే ఉత్పత్తి 1720 మెగావాట్ల నుండి 2520 మెగావాట్లకు చేరుకుంటుంది. 1720 మెగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుదుత్పత్తికి రోజుకు 40 వేల టన్నుల బొగ్గు, 85.836 క్యూసెక్కుల నీటిని కర్మాగారాలకు వినియోగించాల్సి ఉంటుంది. 7వ దశ నిర్మాణం పూర్తయితే నీరు, బొగ్గు వ్యయాలు మరింతగా పెరగనున్నాయి. ఇంతటి చరిత్ర కలిగిన కేటీపీఎస్ కర్మాగారం తెలంగాణ రాష్ట్రానికే తలమానికంగా నిలవనుంది.