బిజినెస్

ఎన్నాళ్లిలా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లమాడ, ఫిబ్రవరి 17: తల్లి ఆరోగ్యం బాలేదా... కుమార్తె వివాహమా... బ్యాంకు లో డబ్బుంది కదా భయం లేదులే అనుకుంటే పొరపాటే. అవసరానికి బ్యాంకు నుంచి డబ్బు తెచ్చుకోవాలంటే చుక్కలు కనిపిస్తున్న పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతోంది.
ఎవరైనా అత్యవసరాలకు బ్యాంకులకెళ్లి దాచుకున్న డబ్బు ఇవ్వమని అడిగితే రూ.5 వేలుంది తీసుకుపోండి... ఇంతకంటే ఎక్కువ ఇవ్వలేమంటూ బ్యాంకర్లు తరిమేస్తున్నారు. పోనీ ఏటీయంలలో అయినా డబ్బు తీసుకుందాం అనుకుంటే అక్కడా అదే పరిస్థితి. 70 శాతం ఏటీయంలు డబ్బులు లేక మూతపడినవే దర్శనమిస్తున్నాయి. పెద్దనోట్ల రద్దు ఒకటిన్నర ఏడాది క్రితం జరిగినా ఆ కష్టాలు ఇంకా తీరనేలేదు. ముఖ్యంగా అధిక మొత్తాల్లో డిపాజిట్లు బ్యాంకులకు చేరకపోవడం, కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌డీఐ బిల్లు బూచికి ప్రజలు భయపడటమే ముఖ్య కారణంగా కనిపిస్తోంది. జూన్ 2017లో కేంద్ర ప్రభుత్వ మంత్రివర్గం ఎఫ్‌ఆర్‌డీఐ బిల్లు ప్రవేశపెట్టడమే దేశవ్యాప్తంగా బ్యాంకులు ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కునే పరిస్థితికి కారణమని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎఫ్‌ఆర్‌డీఐ (ఫైనాన్షియల్ రెసెల్యూషన్ డిపాజిట్ ఇన్సూరెన్స్) ఈ బిల్లు ఏం చెప్తోందంటే ఏవేని బ్యాంకుల్లో అధిక మొత్తాల్లో అప్పులు తీసుకున్న వారు చెల్లించని సమయంలో ఆ బ్యాంకులు ఆర్థిక సంక్షోభంతో మూతబడినా, మూతబడే వాతావరణం కినిపించినా ఆ బ్యాంకును రెసెల్యూషన్ కార్పొరేషన్‌కు అప్పజెప్తారు. అప్పుడు ఆ బ్యాంకులోవున్న డిపాజిట్ మొత్తాలు ఏరకంగా అయినా ఆ రెసెల్యూషన్ కార్పొరేషన్‌కు మార్చే అధికారం వుంటుంది. డిపాజిట్ దారులకు డిపాజిట్‌ల మొత్తాన్ని చెల్లించలేమనీ చెప్పొచ్చు, మా బ్యాంకుకు నష్టాలు రావడం కారణంగా మీ డిపాజిట్‌లను వినియోగించుకుంటున్నామనీ చెప్పొచ్చు, డిపాజిటర్లకు ఏమాత్రం సమాచారం అందజేయకుండానే ఆమొత్తాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్‌లుగాను, షేర్లలోనూ పెట్టుకునే హక్కు ఆ కార్పొరేషన్‌కు వుంటుందన్నది ఎఫ్‌ఆర్‌డీ ఐ చట్టంలో వున్న మతలబు. బ్యాంకులు జాతీరుూకరణ అయిన తర్వాత మూతబడే ప్రమాదం రాలేదు. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మూతబడే బ్యాంకుని మరో బ్యాంకులో విలీనం చేసి ఖాతాదారులు, డిపాజిట్ దారులకు ఎటువంటి నష్టం జరుగకుండా చర్యలు చేబట్టేవారు. అంతేకాకుండా ఏవైనా బ్యాంకులు మూతబడితే కేంద్ర ఆర్థికశాఖ ద్వారా డిపాజిటర్లకు గ్యారెంటీ ఇచ్చే అవకాశం వుంది. అయితే ఎఫ్‌ఆర్‌డీఐ బిల్లు చట్టం రూపం దాల్చితే డిపాజిట్‌లకు ప్రభుత్వ గ్యారెంటీ వుండదని ఈ బిల్లు తెలుపుతోంది. కోట్ల రూపాయలు బ్యాంకుల్లో రుణాల రూపంలో పొంది ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించని కారణంగా బ్యాంకుకు నష్టం వాటిల్లితే సామాన్యులు డిపాజిట్‌లు చేసిన మొత్తాన్ని ఆ బ్యాంకు ఎటువంటి షరతులూ లేకుండా వినియోగించుకోవచ్చనిది ఎఫ్‌ఆర్‌డీఐ పరమార్థం. ప్రతిపక్షాలు, మేధావులు, ప్రజల్లో ఈ బిల్లుపై వ్యతిరేకత అధికం కావడం కారణంగా దీన్ని పార్లమెంటులో ఆమోదించలేదు. అయితే మోదీని నమ్మడం కష్టమని చాలామంది బ్యాంకుల్లో తమ సొమ్ముని డిపాజిట్ చేయడానికి సాహసించని పరిస్థితి. దాంతోపాటు గతేడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు పరిశీలిస్తే దేశంలోని బ్యాంకుల్లో డిపాజిట్ కావాల్సిన సొమ్ము సుమారు రూ. 2 లక్షల 53 వేల కోట్లు మ్యూచువల్ పండ్స్‌లోకి డిపాజిట్ అయినట్లు ఆర్థిక గణాంకాలు చెబుతున్నాయి. నోట్ల రద్దు సమయంలో రూ. 15 లక్షల 45 వేల కోట్ల పాతనోట్లు ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. అయితే అదే స్థాయిలో కొత్త రూ. 2000, రూ.500 నోట్ల రూపంలో ఎంత డబ్బు విడుదల చేసిందన్న వివరాలు తెలియబరచకపోవడంతోపాటు మధ్యలోనే రూ.2000 నోట్ల ముద్రణ నిలిపివేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. దాంతోపాటు కొత్తగా విడుదల చేసిన రూ.200, రూ.50, రూ.10 నోట్లు ప్రజల లావాదేవీల అవసరం మేరకు రిజర్వ్ బ్యాంక్ ద్వారా కేంద్ర ఆర్థికశాఖ విడుదల చేయించడంలో విఫలమైందన్న ఆరోపణలున్నాయి. నగదు రహిత లావాదేవీలు పెరుగుతాయని కేంద్ర ప్రభుత్వం ఆలోచించినప్పటికీ దేశంలోని అధికశాతం ప్రజలు నగదు లావాదేవీలనే కొనసాగిస్తుండటంతో కూడా నగదు కష్టాలు వెంటాడుతున్నట్లు చెప్పుకోవచ్చు. కేంద్ర ఆర్థిక శాఖ, రిజర్వ్‌బ్యాంక్ నిర్లక్ష్యం కారణంగా బ్యాంకుల్లో దాచుకున్న డబ్బులు అత్యవసరాలకు కూడా తీసుకోలేని దుస్థితి ప్రస్తుతం కొనసాగుతోంది.
బ్యాంకుల్లో నగదు దాచుకోవడం వల్ల పెద్దగా వడ్డీ కూడా రాని పరిస్థితి. బ్యాంకుల్లో డబ్బులేస్తే అవసరానికి ఇవ్వరనీ, అధిక మొత్తాన్ని బ్యాంకుల్లో దాచుకున్నా ఇన్‌కం ట్యాక్స్ సమస్య ఎదురవుతుందనీ, దాచుకున్న మొత్తం అవసరాలకు బ్యాంకులు ఇవ్వడం లేదన్న ప్రచారం తీవ్రం కావడంతో చాలామంది ప్రస్తుతం బ్యాంకుల్లో డబ్బు దాచుకోవడానికి ముందుకు రావడం లేదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇందుకు కేంద్రప్రభుత్వమే బాధ్యత వహించి బ్యాంకుల్లో ఆర్థిక సంక్షోభం తలెత్తకుండా చర్యలు చేబట్టకపోతే రాబోయే రోజుల్లో బ్యాంకుల్లో డబ్బు దాచుకునేవారు లేక వాటి మనుగడ కష్టంగా మారే అవకాశం లేకపోలేదని మేధావులు అంటున్నారు.