బిజినెస్

స్థిరంగా మార్కెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం దరిమిలా ఒడిదొడుకులకు లోనైన స్టాక్ మార్కెట్ నెమ్మదిగా కోలుకునే దిశగా అడుగులు వేసింది. దాదాపు రెండువారాల గందరగోళం నుంచి బయటపడ్డ బీఎఎస్‌ఈ సెనె్సక్స్ 5 పాయింట్లు పెరిగి 34,010.76 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 2.65 పాయింట్లు పతనమై 10,452.30 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ విపణిలో ఆశాజనక పరిణామాలు, మదుపరుల సెంటిమెంట్‌లో అనిశ్చితి, స్థిరమైన ఆర్థిక గణాంకాల, ఐఐపీల అభివృద్ధి సీపీఐ, డబ్ల్యుపీఐ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో మార్కెట్లకు ఊపిరినిచ్చింది. దేశంలో రెండవ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు పీఎన్‌బీలో జరిగిన 11,400 కోట్ల కుంభకోణం మదుపరులపై తీవ్ర ప్రభావం చూపింది. దాదాపు అన్ని కీలకరంగాల్లో షేర్లను ఎక్కువగా విక్రయించారు. ప్రభుత్వరంగ సంస్థల షేర్ల విలువ బాగా పడిపోయింది. దాదాపు 3 శాతం మేరకు వాటి విలువ పతనమైంది. మొత్తానికి ఈవారంలోనే అత్యధికంగా 34,203.34 పాయింట్ల సెనె్సక్స్ లావాదేవీలు ప్రారంభించింది. ఆ తరువాత 34,500.08, 33,9957.33 పాయింట్ల మధ్య ఊగిసలాడుతూ వారాంతానిక 34,010.76 పాయింట్లవద్ద ముగిసింది. మొత్తంమీద 0.01 శాతం అంటే 5 పాయింట్ల మెరుగుదలను నమోదు చేసింది. ఈవారంలో సెనె్సక్స్ దాదాపు 2,2044.68 పాయింట్లు, అంటే 5.67 శాతం నష్టపోయింది. మరోవైపు నిఫ్టీ కూడా వారంలో గరిష్ఠంగా 10,518.20 పాయింట్లతో లావాదేవీలు ప్రారంభించి 10,618.10, 10,434.05 పాయింట్ల మధ్య ఊగిసలాడి 10,452.05 వద్ద ముగిసింది. మొత్తంమీద 2.65 పాయింట్లు, అంటే 0.03 శాతం మేరకు నష్టపోయింది.
ఆయిల్, గ్యాస్, లోహరంగం మినహా ప్రభుత్వరంగ సంస్థలు, బ్యాంకింగ్, ఆటో, టెక్, హెల్త్‌కేర్, ఐపీఓ, రియాల్టీ, కేపిటల్ గూడ్స్, ఐటీ, విద్యుత్ రంగాల షేర్లు భారీగా పతనమైనాయి.