బిజినెస్

ముంబయిలోని పీఎన్బీ శాఖకు తాళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 19: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 11,515 కోట్ల ఎల్‌ఓయూ కుంభకోణంలో ముంబయిలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్రాడీ హౌజ్ బ్రాంచికి తాళం పడింది. ఈ కుంభకోణం సూత్రధారీ, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, ఆయన బంధువుల ఇళ్లు, వ్యాపార కేంద్రాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఐటి అధికారులు ముమ్మరంగా దాడులు, సోదాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో పీఎన్‌బీ బ్యాంకు బ్రాంచికి తాళం పడటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇంత భారీ కుంభకోణానికి ఈ విభాగమే మూల కేంద్రం కావడం గమనార్హం. దేశంలో పీఎన్‌బీకి ఉన్న అతి పెద్ద బ్రాంచీల్లో ఇది రెండోది. సీబీఐ, సీబీఐ ప్రత్యేక కోర్టు, సంబంధిత సీబీఐ అధికారి అనుమతి లేకుండా ఎవరూ ఈ బ్రాంచిలోకి ప్రవేశించడానికి వీల్లేదని అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ బ్రాంచిలో లావాదేవీలన్నీ ఆగిపోయాయి. ఈ పరిణామాలతో అవాక్కయిన సిబ్బంది దిక్కుతోచని స్థితిలో పడ్డారు. పీఎన్‌బీకి చెందిన ఇద్దరు మాజీ ఉద్యోగులతో కలిపి మొత్తం ముగ్గురు నిందితులను సీబీఐ ప్రత్యేక కోర్టు మార్చి 3వరకూ రిమాండుకు పంపిన నేపథ్యంలో ఈ బ్రాంచికి తాళం వేయాలని నిర్ణయించారు. నిందితుల్లో బ్యాంకు మాజీ డిప్యూటీ మేనేజర్ గోకుల్‌నాధ్ షెట్టి, సింగిల్ విండో ఆపరేటర్ మనోజ్ ఖారత్, నీరవ్ మోదీ గ్రూపు కంపెనీల అధికారి హేమంత్ భట్‌లు ఉన్నారు. ఈ కేసులో ప్రాథమికంగా వీరిని అరెస్టు చేశామని, త్వరలోనే మరికొంత మందిని అరెస్టు చేసే అవకాశం ఉందని సీబీఐ అధికారులు తెలిపారు. కాగా, మరో పది మంది అధికారులు, ఇతర డైరెక్టర్లను కూడా ఇప్పటికే సీబీఐ ఈ కుంభకోణంలో నిందితులుగా ప్రకటించింది.