బిజినెస్

నీరవ్ నివాసాల్లో ఈడీ సోదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/ముంబయి, ఫిబ్రవరి 19: పీఎన్‌బీలో భారీ కుంభకోణానికి పాల్పడిన కేసులో ముంబయిలోని ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్‌మోదీ నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహించింది. పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ.11,400 కోట్ల కుంభకోణం కేసులో భాగంగా దర్యాప్తు చేస్తున్న ఈడీ వరుసగా ఐదోరోజూ తనిఖీలు నిర్వహించింది. దక్షిణ ముంబయిలోని వర్లిలో నీరవ్‌మోదీకి చెందిన ‘సముద్ర మహల్ బంగ్లా’కు సోమవారం ఉదయం చేరుకున్న ఈడీ అధికారుల బృందం అణువణువూ గాలించారు. ముంబయితో పాటు పూనే, ఔరంగాబాద్, ధానే, కోల్‌కతా, ఢిల్లీ, లక్నో, బెంగళూరు, సూరత్ సహా 34 ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ దాడుల్లో ఇప్పటివరకు రూ.5,694 కోట్ల విలువైన వజ్రాలు, బంగారు ఆభరణాలను ఈడీ అధికారులు సీజ్ చేశారు. ఈ భారీ కుంభకోణంలో నీరవ్‌మోదీ, అతడి బంధువు మొహల్ ఛోస్కీ సహా పలువురికి సంబంధం ఉన్న నేపథ్యంలో వీరితోపాటు వారు నిర్వహిస్తున్న సంస్థల లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడంపై అధికారులు దృష్టిపెట్టారు. కేసులో పురోగతికి అవి ఎంతో కీలకమని వారు చెబుతున్నారు.
‘కొన్ని కంప్యూటర్లు, హార్డ్ డ్రైవ్‌లు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నామని, వీటిని పరిశీలిస్తున్నామ’ని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. హవాలా మోసాలకు సంబంధించిన కేసులో పురోగతిని స్వయంగా పర్యవేక్షించేందుకు సోమవారంనాడు ఈడీ డైరక్టర్ కర్నల్‌సింగ్ ముంబయి వచ్చారు. ఈ కుంభకోణంలో హవాలా లావాదేవీల గుట్టును ఛేదించేందుకు ఈడీ బృందం ఈనెల 15వ తేదీనుంచి విచారణ చేపట్టి నీరవ్‌మోదీ కార్యాలయాలు, నివాసాలపై దాడులు చేసింది. 200 డొల్ల కంపెనీల ద్వారా అక్రమ లావాదేవీలు నిర్వహించారని కనిపెట్టిన ఈడీ తన దర్యాప్తును ముమ్మరం చేసింది.