బిజినెస్

కొనసాగిన నష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 19: దేశీయ మార్కెట్లు వరుసగా రెండో రోజూ, సోమవారం గందరగోళం మధ్య నష్టాలను నమోదు చేశాయి. సెనె్సక్స్ 236 పాయింట్లు కోల్పోయి రెండు నెలల కనిష్టస్థాయికి అంటే 33,775 స్థాయికి పడిపోయింది. మరోవైపు బ్యాంకింగ్, మెటల్ రంగాల షేర్ల పతనం ఇంకా కొనసాగింది. పీఎన్‌బీ షేర్ల విలువ 52 వారాల కనిష్ఠానికి పడిపోగా టాటాస్టీల్స్ 5.82 శాతం మేరకు షేర్లను కోల్పోయింది. శుక్రవారం ఉదయం లావాదేవీల్లో 236.10 పాయింట్లు కోల్పోయిన సెనె్సక్స్ సాయంత్రానికి లావాదేవీలు ముగిసేసరికి 33,774.66 పాయింట్ల వద్ద స్థిరపడింది. అదే సమయంలో నిఫ్టీ కూడా 73.90 పాయింట్లు కోల్పోయి 10,378.40 పాయింట్ల వద్ద స్థిరపడింది. పీఎన్‌బీ కుంభకోణం ప్రభావంతో గతవారం గందరగోళం, అనిశ్చితిమధ్య ఆటుపోట్లు ఎదుర్కొన్న దేశీయ మార్కెట్లు సోమవారం కూడా అదే ధోరణిలో లావాదేవీలు నమోదు చేశాయి.