బిజినెస్

రొటొమాక్ కుంభకోణం 3,695 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: ప్రముఖ బ్రాండ్ ‘రొటొమాక్’ పెన్నుల తయారీ సంస్థ ప్రమోటర్ విక్రమ్ కొఠారీపై అన్నివైపుల నుంచి ఉచ్చు బిగుస్తోంది. కొఠారీపై అటు సీబీఐ, ఇటు ఈడీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాయి. బ్యాంకుల నుంచి భారీగా రుణాలు పొంది ఎగవేసినట్లు వచ్చిన ఆరోపణలపై సీబీఐ కేసు నమోదు చేయగా హవాలా మోసాలకు పాల్పడ్డారంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) కేసు నమోదు చేసింది. కాగా రొటొమాక్ రుణాల ఎగవేత కుంభకోణం విలువ మొదట్లో రూ.800 కోట్లుగా భావించినప్పటికీ సీబీఐ దర్యాప్తులో బహిర్గతమైన సమాచారం ప్రకారం దీని విలువ రూ.3,695 కోట్లుగా తేలింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రమోటర్ విక్రమ్ కొఠారీ, అతడి భార్య, కుమారుడిపై కూడా సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ మేరకు ఎఫ్‌ఐఆర్‌లో వారి పేర్లు చేసినట్లు అధికారులు సోమవారం నాడు వెల్లడించారు. కాన్పూర్ కేంద్రంగా పనిచేస్తున్న రొటొమాక్ గ్లోబల్ ప్రవేట్ లిమిటెడ్ సంస్థపైన, దాని డైరక్టర్ విక్రమం కొఠారి, భార్య సాధనా కొఠారి, కుమారుడు రాహుల్ కొఠారీ, మరికొందరు ఇంకా గుర్తించని కొందరు అధికారులు ఈ భారీ మోసానికి పాల్పడ్డారంటూ బ్యాంక్ ఆఫ్ బరోడా ధికారులు ఫిర్యాదు చేశారని సీబీఐ పేర్కొంది. కాన్పూర్‌లో కొఠారీ నివాసంతోపాటు ఆయన అధికార కార్యాలయాల్లో సీబీఐ దాడులు చేసి సోదాలు నిర్వహించింది. తనిఖీలు కొనసాగుతాయని, ఆ తరువాత నిందితులను విచారిస్తామని ఈ సందర్భంగా వారు చెప్పారు. కొఠారీపై ఒకవైపు సీబీఐ దర్యాప్తు చురుకుగా సాగుతుండగా మరోవైపు అతడి లావాదేవీలపై దృష్టి సారించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) హవాలా మోసాలకు పాల్పడినట్లు నిర్ధారించింది. 3695 కోట్ల కుంభకోణానికి పాల్పడిన కొఠారీ కుటుంబం హవాలా మార్గాల్లో ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు భావిస్తోంది. ఈ మేరకు కొఠారీతోపాటు భార్య, కుమారుడిపై కేసు నమోదు చేసింది. సీబీఐ నమోదు చేసిన కేసును పరిశీలించిన తరువాత ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎమ్‌ఎల్‌ఏ) ప్రకారం ఈడీ ఈ చర్య తీసుకుంది. బ్యాంకు నుంచి రుణాలను హవాలా వ్యాపారానికి మళ్లించారా, అక్రమాస్తులు కూడగట్టారా, నల్లడబ్బుగా దాచారా అన్న విషయాలపై విచారణ జరుపుతామని ఈడీ అధికారులు చెప్పారు. రొటొమాక్ సంస్థ తీసుకున్న రుణం రూ. 2,919 కాగా దానిపై వడ్డీతో కలపి 3695 కోట్ల మేరకు కొఠారీ ఎగవేశారు.
ప్రభుత్వరంగానికి చెందిన పంజాబ్ నేషనల్ బ్యాంకులో ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్‌మోదీ రూ.11,400 కోట్ల మేరకు కుంభకోణానికి పాల్పడిన కేసు వెల్లడైన తరువాత వెలుగులోకి వచ్చిన రెండో అతిపెద్ద కుంభకోణం ‘రొటొమాక్’ కొఠారీదే.