బిజినెస్

డీలాపడిన దేశీయ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిన్న బలపడిన దేశీయ మార్కెట్లు సెనె్సక్స్, నిఫ్టీ గురువారం నాడు మళ్లీ నేలచూపులు చూశాయి. ఈ ఫిబ్రవరిలో ఒకటి రెండు సెషన్లు మినహా ఎక్కువగా నష్టాలనే చూసిన మార్కెట్లు పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం వెలుగులోకి వచ్చాక ఒడిదుడుకులకు గురయ్యాయి. ఆ తరువాత తొలిసారిగా బుధవారం కాస్తంత కోలుకున్నాయి. అయితే మళ్లీ గురువారం స్వల్పంగా నష్టాలను ఎదుర్కొన్నాయి. ద్రవ్యోల్బణం పెరుగుతుందన్న భయం, డాలర్‌తో రూపాయి మారకం విలువ తగ్గడం వంటి కారణాలతో ఆందోళన చెందిన మదుపరులు వెనుకడుగు వేయడంతో మారెట్లు నష్టాలను చవిచూసాయి. దేశీయ మార్కెట్లలో మంగళవారం లావాదేవీలు ఆశాజనకంగానే మొదలయ్యాయి. సెనె్సక్స్ 33,817.09 పాయింట్లతో మొదలైన లావాదేవీలు ఒక దశలో 33,691.42 పాయింట్లకు పడిపోయాయి. ఆ తరువాత పుంజుకుని 33,868.74 పాయింట్లకు చేరుకున్నా ఆ తరువాత మళ్లీ జోరు తగ్గి 33,819.50 పాయింట్లవద్ద స్థిరపడింది. దీంతో 25.36 పాయింట్ల పతనమైంది. మరోవైపు నిఫ్టీ 10,340.65, 10,393.15 పాయింట్ల మధ్య ఊగిసలాడి చివరకు 10,383.70వద్ద స్థిరపడింది. మొత్తంమీద 14.75 పాయింట్ల పతనాన్ని నమోదు చేసింది. ఆసియా మార్కెట్లు బలంగానే ఉన్నప్పటికీ, వడ్డీరేట్లను అమెరికా పెంచుతుందన్న భయం, డాలర్‌తో రూపాయి విలువ మూడు నెలల కనిష్ఠానికి, అంటే 34 పైసలు తగ్గి 65.10గా ఉండటంతో దేశీయ మదుపరులపై ప్రభావం చూపింది. గురువారం లావాదేవీల్లో డాక్టర్ రెడ్డీస్ 2.19 శాతం షేర్లను నష్టపోగా, ఆ తరువాతి స్థానాల్లో ఓఎన్‌జీసీ, పవర్‌గ్రిడ్, టాటా మోటార్స్, పీఎన్‌బీ భారీ నష్టాలనే చవి చూశాయి. మరోవైపు వేలాది కోట్ల కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న గీతాంజలి జెమ్స్ 5 శాతం మేరకు షేర్ల విలువ కోల్పోయింది. మరోవైపు ఆయిల్, గ్యాస్ షేర్లు నేలచూపులు చూశాయి.