బిజినెస్

ఆటోమొబైల్ రంగానికి ఏపీలో మెరుగైన అవకాశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 24: ఆటోమొబైల్ రంగానికి ఆంధ్రప్రదేశ్‌లో మెరుగైన అవకాశాలు ఉన్నాయని పరిశ్రమల శాఖ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి తెలియచేశారు. విశాఖలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు తొలిరోజు శనివారం జరిగిన బ్రేక్‌అవుట్ సెషన్‌లో ‘స్పేర్‌హెడింగ్ మ్యానుఫాక్చరింగ్ ఆఫ్ నెక్ట్స్ జనరేషన్ ఆటోమొబైల్స్ ఫర్ ది గ్లోబల్ మార్కెట్’ అన్న అంశంపై మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పలు రాయితీలు కల్పిస్తోందని చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలో ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉందని అన్నారు. ప్రపంచంలో మనం ఎనిమిదవ స్థానంలో ఉన్నామని ఆయన తెలియచేశారు. ఆటోమొబైల్ రంగం ఆంధ్రప్రదేశ్‌లో త్వరితగతిన అభివృద్థి చెందుతోందని అమర్‌నాథ్‌రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో 100 ఆటోమొబైల్ పరిశ్రమలు ఉన్నాయని, ఈ రంగంలో గడచిన మూడున్నర సంవత్సరాల్లో 3.7 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు వచ్చాయని ఆయన తెలియచేశారు. రాష్ట్రంలో ఆటోమొబైల్ రంగంలో విదేశీ పెట్టుబడులు పెరుగుతున్నాయని అన్నారు. ఇందులో ప్రధానమైనవి కియా మోటార్స్, ఇసుజి, అపోలో టైర్స్, భారత్‌ఫోర్బ్స్, వీరవాహన బస్ బిల్డింగ్ యూనిట్స్ ప్రధానమైనవని మంత్రి పేర్కొన్నారు. ఈ రంగంలో 2020 నాటికి సుమారు రెండు లక్షల మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయని ఆయన చెప్పారు. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టిన వారికి ఇప్పటి వరకూ 500 కోట్ల రూపాయల వరకూ రాయితీలు కల్పించామని ఆయన తెలియచేశారు. చిత్తూరు, అనంతపురం జిల్లాలు ఆటోమొబైల్ హబ్స్‌గా రూపుదిద్దుకోనున్నాయని మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి తెలియచేశారు. 2019 చివరి నాటికి ఇక్కడి నుంచి ఉత్పత్తులు ప్రారంభమవుతాయని ఆయన వివరించారు. అలాగే, అనంతపురం-నెల్లూరు మధ్య రెండు భారీ ఆటోమొబైల్ కారిడార్లు రానున్నాయని ఆయన చెప్పారు.